Home » Entertainment » Rajamouli About Movie With Pawan Kalyan
Entertainment

Pawan Kalyan : అంత జరిగిందా?.. పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి ప్రాజెక్ట్!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 31, 2021 2:45 pm
Advertisement

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాటిని అభిమానులు మాత్రమే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడూ కోరుకుంటాడు. దర్శకధీరుడు రాజమౌళి హీరోను చూపించే విధానానికి అందరూ ఫిదా అవుతుంటారు. అందుకే తమ అభిమాన హీరోలు ఒక్కసారైనా సరే ఆయన దర్వకత్వంలో కనిపించాలని ఆరాట పడుతుంటారు. అలాంటి రేర్ కాంబినేషన్‌లో పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబో కూడా ఉంటుంది. అయితే ఇక ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడమన్నది జరగదు.

Advertisement

Rajamouli About Movie With Pawan Kalyan

ఎందుకంటే గతంలోనే ఓ సారి చర్చలు జరిగాయట. కానీ పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాలేదు. ఏడాదిన్నర వెయిల్ చేశాడట మన జక్కన్న. మొత్తానికి తాజాగా రాజమౌళి ఆ గుట్టంతా బయటపెట్టేశాడు. పవన్ కల్యాణ్, నాకు మధ్య ఓ సినిమా షూటింగ్ గ్యాప్ లో చర్చలు జరిగాయి. ఎలాంటి సినిమా కావాలో చెప్పాలని అడిగాను. నేను ఎలాంటి సినిమా అయినా చేస్తానన్నారు పవన్. నన్నే చెప్పమన్నారు. సరే సర్.. టైమ్ ఇవ్వండి. మీరు ఏ టైమ్ లో రమ్మంటే ఆ టైమ్ కు వచ్చి కథ చెబుతానన్నాను. ఆ తర్వాత ఏడాదిన్నర ఎదురుచూశాను. ఆయన దగ్గర్నుంచి కబురు రాలేదు అని రాజమౌళి చెప్పేశాడు.

Advertisement

Pawan Kalyan : దారులు వేరయ్యాయన్న జక్కన్న

Rajamouli About Movie With Pawan Kalyan

అలా పవన్ కల్యాణ్ కాల్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లోనే తన ఆలోచన విధానం మారిపోయిందన్నాడు రాజమౌళి. మగధీర, యమదొంగ, ఈగ లాంటి సినిమాలు చేస్తూ లార్జర్ దేన్ లైఫ్ కథల్ని ఎంచుకున్నానని తెలిపాడు. ఆ టైమ్ లో నా ఆలోచన విధానం మారిపోయింది. మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కాస్త పెద్ద సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. మగధీర, యమదొంగ టైపు సినిమాల వైపు వెళ్లిపోయాను. ఈలోగా పవన్ కల్యాణ్ సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. నాకు ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం అలవాటు అయిపోయింది. అలా మా దారులు వేరయ్యాయని చెప్పేశాడు. అంటే భవిష్యత్తులోనూ ఈ కాంబోలో సినిమా రాదన్న మాట.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి