Rajamauli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి Rajamauli – సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని గత నాలుగైదేళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరు వేరే ప్రాజెక్టులతో బిజీకావడం వల్ల ఎప్పటికికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకి ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఇటీవల దర్శకుడు రాజమౌళి Rajamauli, హీరో మహేష్ బాబు Mahesh babuతో పాటు చిత్ర నిర్మాత డా.కె.ఎల్.నారాయణ క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కథ ..బడ్జెట్ విషయాలలో ప్రచారం మొదలైంది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనిని పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కించేందుకు కథ రెడీ చేస్తున్నారట.
ఆ కథకి భారీ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఆయన తీసే సినిమాల బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. బాహుబలి కంటే మించి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ కి బడ్జెట్ కేటాయించారు. 450 కోట్ల బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తుండగా శక్తివంతమైన పోరాట యోధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ Jr NTR, మెగా పవర్ స్టార్ రాం చరణ్ Ram charan నటిస్తున్నారు. గోండ్రు బెబ్బులి కొమురం భీంగా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించబోతున్నారు.
కాగా ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ తో పాన్ ఇండియన్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకి పైగానే కాటాయించనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. నిర్మాత నారాయణకి, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా తీయడం పెద్ద డ్రీం. అందుకే బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని డిసైడయ్యాడట. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్ మీద సంతోషం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, నిన్నే ఇష్టడ్డాను వంటి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అయితే ఇలాంటి హై బడ్జెట్ సినిమా ఈ నిర్మాణ సంస్థ నుంచి రావడం ఇదే మొదటిసారి. 2022 లో ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఏడాది చివరిలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.