rajamouli marrige news viral
Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆయన ఓటమెరుగని విక్రమార్కుడిగా అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఆయన సినిమా చేస్తే మినిమం మూడేళ్ల పట్టి తీరాల్సిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో రాజమౌళి ఖ్యాతి మరింత పెరిగింది. త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని సమాచారం. అయితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దగ్గర శిష్యరికం చేసి ‘స్టూడెంట్ నెంబర్1’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుని మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి.
ఆ తరువాత ‘సింహాద్రి’ ‘సై’ ‘ఛత్రపతి’ ‘విక్రమార్కుడు’ ‘యమదొంగ’ ‘మగధీర’ ‘మర్యాద రామన్నా’ ‘ఈగ’ ‘బాహుబలి1′ బాహుబలి2’ , ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలను తెరకెక్కించి అపజయమెరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. ‘మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి?’ అని రాజమౌళినే అడిగితే మా ఫ్యామిలీ అని సింపుల్ గా సమాధానం చెబుతుంటాడు మన జక్కన్న. అయితే జక్కన్న తన పర్సనల్ లైఫ్‌లో రెండో పెళ్లి చేసుకోవడం పలు సార్లు చర్చనీయాంశంగా మారుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తనని తాను నిరూపించుకున్నారు రమా రాజమౌళి. అయితే ఆమె ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి రెండో భార్య అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
rajamouli marrige news viral
గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు రమ. ఈ జంటకు కార్తికేయ అనే కొడుకున్నాడు. ఆ తర్వాత రమ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2000లో కలుసుకున్న రమ, రాజమౌళి స్నేహం.. క్రమంగా ప్రేమగా మారింది.. అలా క్రమంగా వారి మనసుల్లో ఒకరిపై మరొకరికి ఏర్పడిన ప్రణయం గురించి తెలియజేసుకున్న ఈ జంట.. 2001లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆపై వీరిద్దరూ మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అదే విధంగా రాజమౌళి విజయం వెనక కూడా ఆయన సతీమణి రమా రాజమౌళి ఉన్నారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.