Bahubali 3 : ప్రభాస్ సేనా.. సిద్ధమా … బాహుబలి 3 వస్తోంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bahubali 3 : ప్రభాస్ సేనా.. సిద్ధమా … బాహుబలి 3 వస్తోంది !

Bahubali 3 : బాహుబలి మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ తల ఎత్తుకుని నిలబడింది. అప్పటివరకు టాలీవుడ్ అంటే ఎవరికి తెలియదు కానీ బాహుబలితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసింది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా పేరుపొందింది బాహుబలి. డైరెక్టర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,10:00 pm

Bahubali 3 : బాహుబలి మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ తల ఎత్తుకుని నిలబడింది. అప్పటివరకు టాలీవుడ్ అంటే ఎవరికి తెలియదు కానీ బాహుబలితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసింది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా పేరుపొందింది బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తో చరిత్ర సృష్టించాడు. కమర్షియల్ ,యాక్షన్ సీన్లతో రాజమౌళి సినిమాను ఓ రేంజ్ కు తీసుకొచ్చాడు.

అలాగే మర్యాద రామన్న,ఈగ లాంటి సినిమాలను తీసి తను ఎలాంటి సినిమాలనైనా తీయగలనని నిరూపించుకున్నాడు జక్కన. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీతో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ దెబ్బతో డైరెక్టర్ రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 తో వీరి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.

Rajamouli says about bahubali part 3

Rajamouli says about bahubali part 3

బాహుబలి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సన్నివేశం అందరికీ గుర్తుండిపోయేలా చిత్రీకరించాడు రాజమౌళి. ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. అయితే దీనిలో భాగంగా బాహుబలి 3 ఉండబోతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే బాహుబలి చిత్రం బృందం మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.కాని కచ్చితంగా బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నాయని జక్కన్న పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇక బాహుబలి 3 త్వరలోనే పట్టాలెక్కనుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో బాహుబలి 3 వస్తే బాగుండు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది