SS Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..!
SS Rajamouli : రాజమౌళి SS Rajamouli డైరెక్షన్ లో మహేష్ బాబు Mahesh Babu చేస్తున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. అందరి దర్శకులతో సినిమా ఒకలా ఉంటే జక్కన్నతో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. SS Rajamouli రాజమౌళి మహేష్ బాబు Mahesh babu కాంబో సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తైంది. ఐతే వర్క్ షాప్ లు కూడా ప్లాన్ చేస్తున్న రాజమౌళి సినిమా షూటింగ్ టైం లో స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నాడట. రాజమౌళి సినిమా సెట్ లో ప్రతి ఒక్కరు ఆయన రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. అక్కడ లైట్ బోయ్ నుంచి స్టార్ హీరో వరకు అంతా సమానమే. అందుకే ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాకు రాజమౌళి రూల్స్ తో చంపేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ తో అగ్రిమెంట్ చేయించుకున్న రాజమౌళి ఫోన్లను లాక్కున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల పాటు స్టార్స్ పర్సనల్ ఫోన్స్ కూడా రాజమౌళి దగ్గర ఉంటాయని తెలుస్తుంది.
SS Rajamouli : ఫోన్లు కూడా లాక్కున్న రాజమౌళి.. మహేష్ బాబుకి కండిషన్ అప్లై..!
మహేష్ బాబు Mahesh Babu ఫోన్ కూడా రాజమౌళి తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. SS Rajamouli రాజమౌళి సినిమా అంటే 24 గంటలు తన సినిమా గురించి మాత్రమే ఆలోచించాలి వేరే డిస్ట్రాక్షన్ ఉండేలా చేయడు. అది సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు మాత్రమే జక్కన్న అలా చేస్తాడు. రాజమౌళి సినిమా కమిట్ అయ్యేప్పుడే వీటి గురించి బాగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది…
ఎప్పుడైతే రాజమౌళి SS Rajamouli షూటింగ్ మొదలవుతుందో ఆయన వదిలి పెట్టే దాకా ఇక అన్నీ పనులు ఆపేసుకోవాల్సిందే. సినిమా అవుట్ పుట్ తను అనుకున్నట్టుగా వచ్చేందుకు రాజమౌళి ఏం కావాలన్నా చేస్తాడు. అందుకే ఆయన ఓటమి ఎరుగని దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ బాబు Mahesh babu సినిమా షూటింగ్ లో కూడా ఫోన్లు అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడట. అంతేకాదు సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. అమ్మడు కూడా ఈ సినిమాకు జక్కన్న అడిగినంత టైం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. Rajamouli, Mahesh Babu, SSMB29, Priyanka Chopra
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.