
Rajasekhar : యాంగ్రియంగ్ మెన్‌గా ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పుడు అంతగా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా మాత్రమే సందడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే రాజశేఖర్ కెరీర్ మార్చేసింది రాజశేఖర్ అని చెప్పాలి. యాంగ్రి యంగ్ మేన్ ఇమేజ్‌తో రాణిస్తున్న రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని తీసి హిట్ కొట్టాడు. రాజశేఖర్‌కి బిగ్ హిట్ ఇచ్చాడు. యాంగ్రి యంగ్ మేన్ నుంచి రొమాంటిక్ ఇమేజ్‌ని తీసుకొచ్చాడు. ఈ సినిమాతో రాజశేఖర్ కెరీర్ కూడా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అది రాజశేఖర్‌కి లైఫ్ టర్నింగ్ మూమెంట్. అలా లైఫ్ మార్చేసిన దర్శకుడితో రాజశేఖర్ గొడవ పడటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.
తాగేసి రాజశేఖర్.. రాఘవేంద్రరావు మీదకు వెళ్లాడని, తిట్టుకోవడమే కాదు, కొట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అందరి ముందు రాఘవేంద్రరావుని రాజశేఖర్ కొట్టాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు మనుషులు రాజశేఖర్‌ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని పోయారని అనేక ప్రచారాలు సాగాయి. దీనిపై రాజశేఖర్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. జీవిత, రాజశేఖర్ మొదట్లో చెన్నైలోనే ఉండేవాళ్లు. ఆ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలో తన పిల్లలను చూసుకునేందుకు చెల్లిని, తల్లిని హైదరాబాద్‌కి తీసుకొచ్చింది జీవిత. అడపాదడపా ఆమె సినిమాల షూటింగ్‌లకు వచ్చేదట.
ఓ సమయంలో ఆమె రాఘవేంద్రరావుని సెట్‌లో కలిసిందట. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆమెని సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు అన్నాడట. సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం రాజశేఖర్‌కి చేరింది. తన మరదలిని రాఘవేంద్రరావు వాడుకోబోతున్నట్టుగా, ఆమెని ఛీట్ చేయబోతున్నట్టుగా రాజశేఖర్‌కి ఎక్కించడంతో బాగా తాగేసి ఉన్న రాజశేఖర్.. రాఘవేంద్రరావు దగ్గరకి వెళ్లి గొడవ పడ్డాడట. రాజశేఖర్ గట్టిగా అరవడంతో పెద్ద గొడవలా ప్రొజెక్ట్ అయ్యింది. దీంతో మీడియా దాన్ని మరింత హైలైట్ చేసి రాసింది. ఆ విషయంలో రాఘవేంద్రరావు తప్పేమీ లేదని, తానే ఆవేశంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆయనపైకి వెళ్లానని, తనదే తప్పు అని చెప్పాడు రాజశేఖర్. అయితే అలా చెప్పింది ఒక హీరోయిన్ అని, ఆమె రాజశేఖర్‌పై క్రష్ ఉండేదని, కానీ ఎప్పుడూ జీవిత పక్కనే ఉండటంతో తట్టుకోలేక, ఇలా తమ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిందని జీవిత వెల్లడించింది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.