kalki 2898 AD Movie : రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌ల‌న ప్ర‌భాస్ క‌ల్కిపై ప‌డుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

kalki 2898 AD Movie : రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌ల‌న ప్ర‌భాస్ క‌ల్కిపై ప‌డుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.!

kalki 2898 AD Movie  : స‌లార్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ చిత్రం క‌ల్కి 2898 ఏడి.ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని ప్రతి ఒక్క‌రు భావిస్తున్నారు.మ‌హాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,2:08 pm

ప్రధానాంశాలు:

  •  kalki 2898 AD Movie : రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌ల‌న ప్ర‌భాస్ క‌ల్కిపై ప‌డుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.!

kalki 2898 AD Movie  : స‌లార్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ చిత్రం క‌ల్కి 2898 ఏడి.ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని ప్రతి ఒక్క‌రు భావిస్తున్నారు.మ‌హాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అభిమానులు ఎగ‌బ‌డి మ‌రీ టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి వారికి ఓ షాక్ తగిలింది.

kalki 2898 AD Movie  భ‌లే దెబ్బేశారుగా..

కల్కి అని సర్చ్ చేస్తే అక్కడ ప్రభాస్ కల్కి కాకుండా.. రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కల్కి కనిపిస్తోంది. ఆ కంగారు, ఆత్రుతలో చూసుకోకుండా చాలా మంది దాని టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అలా ఏకంగా కొన్ని ఏరియాల్లో ఆరు షోలు కూడా ఫుల్ అయిపోయాయి. తీరా చివరకు చూస్తే అది రాజశేఖర్ కల్కి అని తెలుసుకుని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన బుక్ మైషో ఇక్క‌డ కంగారు పడాల్సిన పనేమీ లేదని, రాజశేఖర్ కల్కికి బుక్ చేసినా కూడా అది ప్రభాస్ కల్కి 2898 ఏడీకే వర్తిస్తుందని హామీ ఇచ్చిందట. దీంతో ఫ్యాన్స్ అంతా శాంతించారు.

kalki 2898 AD Movie రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌ల‌న ప్ర‌భాస్ క‌ల్కిపై ప‌డుతున్న ఎఫెక్ట్ అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు

kalki 2898 AD Movie : రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌ల‌న ప్ర‌భాస్ క‌ల్కిపై ప‌డుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.!

తన సినిమాకు టికెట్స్ బుక్ అవుతుండటం తెలిసిన రాజశేఖర్ సోషల్ మీడియా వేదికగా.. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అంటూ రెండు వైవిధ్యమైన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత మళ్లీ.. ‘‘జోక్ పక్కన పెడితే.. ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్విని దత్‌గారు వైజయంతీ ఫిల్మ్స్, మరియు ఇందులో చేసిన అద్భుతమైన నటీనటులందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ సినిమాతో చరిత్ర సృష్టించి.. టాలీవుడ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కిస్తారని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక క‌ల్కి చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అమితాబ్, క‌మ‌ల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించనున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది