రజనీకాంత్ అల్ ఇండియా వైడ్ గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సూపర్ స్టార్. ఫ్యాన్స్ కి తలైవా. రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, నడక, నడత.. వేరే ఏ స్టార్ కి లేనటువంటి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. తమిళనాట మాత్రమే కాదు ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ రజని అంటే పడిచచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. తలైవా నటించే ప్రతి సినిమా సమాజానికి మెసేజ్ ఇచ్చేదిలానే ఉంటుంది. అందుకే ఆయన జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఒక బస్సు కండెక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ లెవెల్ కి చేరుకోవడం అంత సులువైన పని కాదు.
అందుకు ఎంతో పట్టుదల అవసరం. ఆ పట్టుదలతోనే చిత్ర పరిశ్రమలో చిన్న పాత్ర చేసి అంచెలంచెలుగా ఎదిగి, ప్రేక్షకుల ఆదరణను పొందారు సూపర్ స్టార్ రజనీకాంత్. అందుకే అయన సినిమాల కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. కరోనా నిబందనలు తొలిగినప్పటి నుంచి మల్లి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది సినీ ఇండస్ట్రీ. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి మళ్ళీ సినీ నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల రీషూటింగ్ ను ప్రారంభించాయి. ఇందులో భాగంగానే రజని కూడా అన్నతే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే షూటింగ్ స్పాట్ లో కరోనా కేస్ లు రావడం తో మళ్ళీ షూటింగ్ నిలిచిపోయింది. ఇదే సమయం లో రజని ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో జూబిలీహిల్స్ లోని హాస్పిటల్ లో చేరారు. రెండు రోజుల చికిత్స అనంతరం చెన్నై లోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్ లు రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటికి రజనీకాంత్ మళ్ళి షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ కి చెప్పి షాకిచ్చారు. వాస్తవంగా అయితే ఇక ఇప్పట్లో రజనీకాంత్ షూటింగ్ కి రారని అందరూ భావించారు. కాని మేకర్స్ ని దృష్ఠిలో పెట్టుకొని రజనీకాంత్ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రజనీ అన్నాతే సినిమాకి శివ దర్శకత్వం వహిస్తుండగా నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.