రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయి వచ్చి ఇలా షాకిచ్చారేంటి ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రజనీకాంత్ హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయి వచ్చి ఇలా షాకిచ్చారేంటి ..?

రజనీకాంత్ అల్ ఇండియా వైడ్ గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సూపర్ స్టార్. ఫ్యాన్స్ కి తలైవా. రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, నడక, నడత.. వేరే ఏ స్టార్ కి లేనటువంటి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. తమిళనాట మాత్రమే కాదు ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ రజని అంటే పడిచచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. తలైవా నటించే ప్రతి సినిమా సమాజానికి మెసేజ్ ఇచ్చేదిలానే ఉంటుంది. అందుకే ఆయన జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు […]

 Authored By govind | The Telugu News | Updated on :29 December 2020,9:40 am

రజనీకాంత్ అల్ ఇండియా వైడ్ గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సూపర్ స్టార్. ఫ్యాన్స్ కి తలైవా. రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, నడక, నడత.. వేరే ఏ స్టార్ కి లేనటువంటి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. తమిళనాట మాత్రమే కాదు ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ రజని అంటే పడిచచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. తలైవా నటించే ప్రతి సినిమా సమాజానికి మెసేజ్ ఇచ్చేదిలానే ఉంటుంది. అందుకే ఆయన జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఒక బస్సు కండెక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ లెవెల్ కి చేరుకోవడం అంత సులువైన పని కాదు.

Annaatthe Official First Look Teaser | Rajinikanth | Nayanthara | Keerthi Suresh| Siva |Sun Pictures - YouTube

 

అందుకు ఎంతో పట్టుదల అవసరం. ఆ పట్టుదలతోనే చిత్ర పరిశ్రమలో చిన్న పాత్ర చేసి అంచెలంచెలుగా ఎదిగి, ప్రేక్షకుల ఆదరణను పొందారు సూపర్ స్టార్ రజనీకాంత్. అందుకే అయన సినిమాల కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. కరోనా నిబందనలు తొలిగినప్పటి నుంచి మల్లి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది సినీ ఇండస్ట్రీ. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి మళ్ళీ సినీ నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల రీషూటింగ్ ను ప్రారంభించాయి. ఇందులో భాగంగానే రజని కూడా అన్నతే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు.

Rajini 168 Latest Updates | Annatha | Meena | Kushboo | Keerthysuresh | Nayanthara | Red Spider - YouTube

అయితే షూటింగ్ స్పాట్ లో కరోనా కేస్ లు రావడం తో మళ్ళీ షూటింగ్ నిలిచిపోయింది. ఇదే సమయం లో రజని ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో జూబిలీహిల్స్ లోని హాస్పిటల్ లో చేరారు. రెండు రోజుల చికిత్స అనంతరం చెన్నై లోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్ లు రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటికి రజనీకాంత్ మళ్ళి షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ కి చెప్పి షాకిచ్చారు. వాస్తవంగా అయితే ఇక ఇప్పట్లో రజనీకాంత్ షూటింగ్ కి రారని అందరూ భావించారు. కాని మేకర్స్ ని దృష్ఠిలో పెట్టుకొని రజనీకాంత్ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రజనీ అన్నాతే సినిమాకి శివ దర్శకత్వం వహిస్తుండగా నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది