
కియారా అద్వానీ, పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. పూజా హెగ్డే కమిటయ్యే సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలే. తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం కంప్లీట్ చేసింది. అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాని దాదాపు కంప్లీట్ చేసింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిటవలేదు. గుణశేఖర్ శాకుంతలం లో పూజా హెగ్డే నే టైటిల్ రోల్ పోషిస్తుందని ప్రచారం అయినప్పటికి ఆ రోల్ సమంత కి దక్కింది.
ఇక బాలీవుడ్ లో పూజా హెగ్డే .. సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలకే ఎక్కువ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు టాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్ వస్తే తప్ప చిన్నా చితకా సినిమాలను ఒప్పుకోవడం లేదట. ఇక కియారా అద్వానీ కి బాలీవుడ్ వదిలి టాలీవుడ్ కి వచ్చే సమయమే దొరకడం లేదు. అంతగా బాలీవుడ్ లో క్రేజీ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా అక్షయ్ కుమార్ తో నటించిన లక్ష్మీ ఫ్లాప్ గా మిగలడం తో కియారా చిన్న షాక్ లో ఉందట.
దానికి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చే షాకులు గట్టిగా తగులుతున్నాయని అంటున్నారు. అంతేకాదు రకుల్ ప్రీత్ ఇచ్చే షాకులు ఒక్క కియారా కే కాదు పూజా హెగ్డే కి కూడా తగులుతున్నట్టు మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం కియారా, పూజా ల కంటే రకుల్ ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తెలుగులో క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా, నితిన్ సినిమాలు చేస్తోంది. అలాగే కమల్ హాసన్ – శంకర్ ల పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 ఉంది. ఇక హిందీలో మేడే అన్న సినిమా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ‘థాంక్ గాడ్’ అన్న సినిమాకి సైన్ చేసింది. ఇలా వరసగా రకుల్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో సినిమాలకి సైన్ చేస్తూ పూజా హెగ్డే, కియారా అద్వానీ లకి చమటలు పట్టిస్తోందని చెప్పుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.