Home » Entertainment » Rakul Preet About Her Fiance
Entertainment

అలాంటి వాడైతే బాగుంటుంది.. కాబోయే భర్తపై రకుల్ ఆశలు!

Authored By
Admin
The Telugu News | Updated on: December 11, 2020, 7:26 pm
Advertisement

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అయితే రకుల్‌కు ప్రేమపై ఎంత నమ్మకముందో మొన్నీ మధ్య బయటపెట్టేసింది. తన తల్లిదండ్రుల 31వ వివాహా వేడుకలను రకుల్ మాల్దీవుల్లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. అక్కడ తన పేరెంట్స్ అలా ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ.. ప్రేమకు అర్థం, ప్రేమపై నమ్మకం వారివల్లే తెలిసిందని చెప్పుకొచ్చింది. తాజాగా మరో సారి ప్రేమ గురించి మాట్లాడుతూ కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది.

Advertisement

Rakul Preet About Her Fiance

ప్రేమ, పెళ్లిపై నాకెంతో నమ్మకం ఉంది. నాకు కాబోయే వరుడికి జీవితంపట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలి. సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చిన నేను.. నాన్న ఉద్యోగం కారణంగా ఆర్మీకి సంబంధించిన వాతావరణంలో పెరిగాను. కాబట్టి నాకు కాబోయే భర్త.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే ఎంతో సంతోషిస్తా. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నా వివాహం జరగాలని ఆశిస్తున్నా. బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ఆలోచన ఉంది అని రకుల్‌ తన మనసులోని మాటలను చెప్పేసింది.

Advertisement

మొత్తానికి రకుల్ మాట్లాడిన మాటలు చూస్తుంటే పెళ్లి ఘడియలు దగ్గరపడ్డట్టే కనిపిస్తున్నాయి. కానీ రకుల్ ప్రస్తుతం సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో మూడు, తెలుగు, తమిళంలో ఒక్కో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఆల్రెడీ వైష్ణవ్ తేజ్ క్రిష్ సినిమా షూటింగ్‌ను రకుల్ పూర్తి చేసింది. ఇక నితిన్ చెక్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. నేడు అమితాబ్ అజయ్ దేవగణ్ రకుల్ కలిసి నటిస్తోన్న మే డే షూటింగ్ ప్రారంభమైంది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి