Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ లవర్ ఈయనే.. ఇతడినే పెళ్లి చేసుకోబోతోంది.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ లవర్ ఈయనే.. ఇతడినే పెళ్లి చేసుకోబోతోంది.. వీడియో వైరల్

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ప్రస్తుతం స్టార్ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది. తన గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 October 2023,2:00 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ప్రస్తుతం స్టార్ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది. తన గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది ఈ భామ. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన చాలా సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లోకి వెళ్లాక తన హద్దులన్నీ చెరిపేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో రెచ్చిపోయి మరీ నటించింది రకుల్. అయితే.. రకుల్ పెళ్లి గురించి ఆ మధ్య చాలా వార్తలు వైరల్ అయ్యాయి. రకుల్ రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు వచ్చాయి.

నిజానికి ఆ వార్తలన్నీ నిజమే. రకుల్ ప్రీత్ సింగ్.. జాకీ భగ్నాని అనే వ్యక్తితో చాలా ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉంది. కానీ.. అతడితో కలిసి ఏనాడూ చెట్టాపట్టాలేసిన వీడియోలు, ఫోటోలు కనపించలేదు. కానీ.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో జనాలు ఊరుకుంటారా? రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్ ను తమ కెమెరాల్లో బంధించారు. తన బాయ్ ఫ్రెండ్ తో చాలా క్లోజ్ మూవ్ అవుతూ అతడి చేతులను పట్టుకొని మరీ ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది రకుల్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రకుల్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే. ఈయనే రకుల్ బాయ్ ఫ్రెండ్ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

rakul preet singh fiance jackky bhagnani video viral

#image_title

Rakul Preet Singh : సోషల్ మీడియాలో ఫోటోలతో రకుల్ రచ్చ

ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న రకుల్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. పొట్టి బట్టలు వేసుకొని కుర్రాళ్లకు పిచ్చి లేపుతోంది. ప్రస్తుతం హిందీలో ఓ రెండు సినిమాలో నటిస్తోంది. తాజాగా జాకీ భగ్నానీతో దొరికిపోవడంతో రకుల్ ఏం మాట్లాడలేకపోయింది. జాకీ భగ్నానీ ఎవరో కాదు.. హిందీ నిర్మాత. త్వరలోనే వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది