Home » Entertainment » Rakul Preet Singh Wants To Eradicate Negativity From Palnet
Entertainment

నాకే ఆ చాన్స్ వస్తే అలా చేసేస్తాను.. రకుల్ కోరికలు మామూలుగా లేవు!!

Authored By
Admin
The Telugu News | Published on: December 24, 2020, 9:03 pm
Advertisement

రకుల్ ప్రీత్ ప్రస్తుతం క్వారంటైన్‌లో బంధీగా ఉంది. ఇటీవలె కరోనా పాజిటివ్ అని తేలడంతో రకుల్ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయింది. రకుల్ ప్రస్తుతం క్వారంటైన్‌లో నాలుగు గోడల మధ్య ఉన్నా గానీ తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంది. క్వారంటైన్‌లో ఉన్నట్టు..కరోనా వచ్చినట్టుగా గానీ రకుల్ ఏ మాత్రం కనిపించడం లేదు. తాజాగా రకుల్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.

Advertisement

Rakul Preet Singh Wants to Eradicate negativity from palnet

ఏ ప్రశ్నలైనా అడగండి.. సమాధానాలు చెబుతాను అని రకుల్ అడిగింది. అలా ఫ్యాన్స్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే అందులో కొన్నింటికి రకుల్ మాటల్లో సమాధానం చెప్పింది. ఫ్యాన్స్ గురించి ఏం చెబుతారని అడిగితే.. వారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవంటూ చెప్పుకొచ్చింది. ఫిట్‌గా ఉండాలన్న స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే.. మా నాన్న నుంచే వచ్చిందంటూ రకుల్ బదులిచ్చింది.

Advertisement

ఈ ప్రపంచంలోంచి ఏదైనా తీసేయగల శక్తి వస్తే ఏం చేస్తారంటూ రకుల్‌ను అడిగారు. దానికి రకుల్ స్పందిస్తూ.. ఈ ప్లానెట్ మీదున్న నెగెటివిటీ మొత్తాన్ని తీసేస్తా అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా పెరిగింది.. సమాజంలోనూ నెగెటివిటీ ఎక్కువగా ఉందని, దాని వల్ల అందరూ ఎంతో బాధపడుతున్నారనే ఉద్దేశ్యంలోనే రకుల్ అలా చెప్పి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వచ్చినప్పుడు ఆమెపై ఎంతటి నెగెటివిటీ ఏర్పడిందో అందరికీ తెలిసిందే.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి