Ram Charan : ఆస్కార్ గెలిస్తే ఎలా ఫీల్ అవుతారు .. చరణ్ ఆన్సర్ తో బిత్తర పోయిన యాంకర్ !
Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. దీంతో ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. దీంతో ఈ పాటకు తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డులను మార్చి 12వ తేదీన ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అమెరికాలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్లో రామ్ చరణ్ పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
నిన్న గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. తాజాగా అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ స్టూడియోలో స్పెషల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో రీవ్ వీల్ రామ్ చరణ్ ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు చరణ్ కూడా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే మీ స్పందన ఏంటి అని అడగ్గా దానికి బదులుగా రాంచరణ్ 80 సంవత్సరాల సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం.
ఇది కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశమంతా గర్వించదగ్గ విషయం. ఆస్కార్ అందుకున్న ఆ క్షణం ఇండియా సినిమా గర్వించే క్షణం అవుతుంది. మరోవైపు తాను నమ్మలేని స్థితిలో ఉంటానని రామ్ చరణ్ తెలిపారు. సినిమా అనేది ఒక ఎమోషన్ కాబట్టి దేశం మొత్తానికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి నేను కూడా సంతోషిస్తాను అని రాంచరణ్ తెలిపారు. ఇక దేశమంతటా ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. ఆస్కార్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఏమవుతుందో కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం నిజంగా చాలా గొప్ప విషయం.