Home » Entertainment » Ram Charan As Siddha Look From Acharya Movie
Entertainment

Ram Charan : చిరంజీవితో రామ్ చరణ్.. ఆచార్య లుక్ అదుర్స్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: March 27, 2021, 10:14 am
Advertisement

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు రెడీ అయ్యాయి. నిన్న ఆర్ఆర్ ఆర్ టీం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లూరి సీతారామారాజుగా రామ్ చరణ్‌ను ఎన్నడూ చూపించని విధంగా చూపించాడు రాజమౌళి. ఇప్పుడు తాజాగా ఆచార్య నుంచి మరో అదిరిపోయే పోస్టర్ వచ్చింది. కొరటాల శివ అదిరిపోయేలా స్కెట్ వేశాడు. రామ్ చరణ్ ఒక్కడి పోస్టర్‌ని మాత్రమే విడుదల చేయకుండా మంచి ప్లాన్ వేశాడు.

Advertisement

Ram Charan  : ధర్మానికి ధైర్యం తోడైన వేళ.. రామ్ చరణ్ ఆచార్య లుక్

ఆచార్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి అండగా నిలబడే సిద్ద పాత్రలో రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో చిరు, చెర్రీలు ఇద్దరూ ఉన్నారు. ధర్మానికి ధైర్యం తోడైన వేళ అంటూ కొరటాల విడుదల చేసిన ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. మీ పక్కన నటించడం అంటే నా కల నెరవేరవడం వంటిది నాన్నా.. ఇంత కంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ నేను ఇంకా ఎప్పుడూ చూడకపోవచ్చు అని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.

ram charan As Siddha Look From acharya Movie

Advertisement

ఇక ఇందులో చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఆ పోరాటంలోనే రామ్ చరణ్ సిద్ద పాత్రలో చిరుకు తోడుగానిలుస్తాడు. తాజాగా వదిలిన పోస్టర్ కూడా అదే చెబుతోంది. చిరంజీవి అలా గన్ పట్టుకున్ని నడుస్తుంటే.. చరణ్ కూడా చిరు వెనకాలే వస్తున్నాడు. మొత్తానికి ఇది మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండువగా ఉంది. కాజల్, పూజా హెగ్డే నటిస్తోన్న ఈ మూవీ మే 13న రాబోతోన్న విషయం తెలిసిందే. కొణిదెల, మ్యాట్నీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి