Ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబోకి ఊహించని హీరోయిన్ ఫిక్స్ చేసిన దిల్ రాజు ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబోకి ఊహించని హీరోయిన్ ఫిక్స్ చేసిన దిల్ రాజు ..?

Ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా ప్రకటన రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అని.. పొల్టికల్ బ్యాక్ […]

 Authored By govind | The Telugu News | Updated on :18 February 2021,5:30 pm

Ram charan : రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా ప్రకటన రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అని.. పొల్టికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే అవకాశాలున్నాయని.. రెండు జోనర్స్ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు జోనర్స్ లో జోనర్ అయినా రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా రికార్డ్స్ తిరగ రాయడం పక్కా అని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అందరికి తెలిసిందే. శంకర్ ఒక్కో సాంగ్ కోసమే కోట్లలో ఖర్చు చేస్తుంటాడు. విజువల్ వండర్ గా సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తుంటాడు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ప్రముఖంగా కియారా అద్వానీ, పరిణీతి చోప్రా ల పేర్లు పరిశీలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Ram charan 15th project with Shankar

Ram charan 15th project with Shankar

Ram charan : రామ్ చరణ్ – శంకర్ సినిమాకి రష్మిక మందన్న ఫైనల్..?

కానీ అనూహ్యంగా ఈ భారీ ప్రాజెక్ట్ కి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ని ఎంపిక చేసున్నట్టు సమాచారం. అధికారకంగా ఈ విషయం వెల్లడి కాకపోయినప్పటికి రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చే ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాకి రష్మిక మందన్న అయితే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగా రష్మిక ఫైనల్ అయిందా లేదా అన్నది అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ఫైనల్ చేసినట్టు సమాచారం. కాగా ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకి వస్తుందని ఈ సారి శంకర్ ఎక్కువగా వీఎఫెక్స్ మీద దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది