Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ముంబైలోనే మకాం వేసి ఉన్న విషయం తెలిసిందే. మొదట సోదరి శ్రీజ తో కలిసి ముంబై వెళ్ళిన రామ్ చరణ్ అక్కడే ఉన్నాడు. చరణ్ సోదరితో కలిసి ఎందుకు అక్కడికి వెళ్లడు.. ఏ పని మీద ఇద్దరు కలిసి వెళ్లారు అంటూ రకరకాలుగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో కొందరు కొన్ని కొన్ని ఊహాగాణాలు చేశారు. శంకర్ మూవీ షూటింగ్ లేదు.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ లేదు దాంతో చరణ్ పూర్తిగా ఖాళీగా ముంబైలో సేద తీరుతున్న అని కొందరు ప్రచారం చేశారు. మరి కొందరు ఈ విషయమై మరో రకంగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. చరణ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు వచ్చాయి.బాలీవుడ్ లో సినిమా ను అతి త్వరలోనే చరణ్ ప్రకటించబోతున్నాడు
అంటూ మరి కొందరు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఒక బిజినెస్ వ్యవహారం కోసం గత కొన్ని రోజులుగా ముంబయిలోనే చరణ్ ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది. దేశంలోనే అతి పెద్ద బిజినెస్ సంస్థ అయిన టాటా గ్రూప్ తో ఒప్పందం కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవలే టాటా గ్రూప్ సంస్థ భారీ మొత్తంలో బిడ్ వేసి ఎయిర్ ఇండియా సంస్థ దక్కిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రామ్ చరణ్ తనకు చెందిన ట్రూ జెట్ విమానయాన సంస్థను టాటా ఎయిర్ ఇండియా సంస్థ తో కలిపి వ్యాపారం నిర్వహించాలని చరణ్ భావిస్తున్నాడట. అందుకోసం ట్రూజెట్ కు సంబంధించిన బిజినెస్ డీల్ తో రామ్ చరణ్ టాటా సంస్థ ప్రతినిధులతో చర్చించేందుకు ముంబైలో ఉన్నట్లుగా తెలుస్తోంది.టాటా గ్రూప్స్ గత కొన్నాళ్లుగా అన్ని వ్యాపారాలు లోనూ విజయాలను సొంతం చేసుకుంటుంది.
కనుక ఈ సమయం లో రామ్ చరణ్ వారితో కలిసి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ వ్యవహారం గురించి క్లారిటీ రావాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మరోవైపు మూడో షెడ్యూల్ కు మార్చిలో ముహూర్తాన్ని ఖరారు చేశారని సమాచారం అందుతోంది. అదే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ను చరణ్ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.