
Ram charan family emotional video
Ram Charan : ఇటీవలే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. దాదాపుగా 11 ఏళ్ల తర్వాత ఈ జంటకు తొలి సంతానం కలిగింది. ఈమధ్య ఆ పాపకు బారసాల కూడా చేసి క్లీం కారా అని నామకరణం చేశారు అయితే జూలై 20న ఉపాసన పుట్టినరోజు సందర్భంగా మెగా దంపతులు కలిసి ఓ స్పెషల్ డాక్యుమెంటరీ చేశారు. డెలివరీ కోసం ఉపాసన ఆపరేషన్ థియేటర్ కు వెళ్లినప్పటినుంచి పాప పుట్టి ఆ తర్వాత నామకరణం చేసే వరకు చోటు చేసుకున్న మూమెంట్స్ ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎలా ఎమోషనల్ అయ్యారు వంటి ప్రతి విషయాన్ని చూపించారు. ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 11 ఏళ్లు అయింది ఏం చేస్తున్నారు ఇద్దరు అన్న ప్రశ్నల వల్ల చాలా ఒత్తిడికి గురయ్యాం.
ఏదైనా ఓ సమయం ప్రకారం జరుగుతుందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది బేబీ టైం. చాలా సంతోషంగా ఉంది. గడిచిన 11 ఏళ్ల దాంపత్య జీవితంలో ఉపాసన త్యాగం చేసింది. అంత సక్రమంగా జరిగింది. పాప ఈ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటి నుంచి నేను ఉపశమనం పొందబోతున్నానని అనిపించింది. తొమ్మిది నెలల ప్రక్రియను నేను బాగా ఎంజాయ్ చేశాను అని అన్నారు. పాపకు క్లీం కారా అని పేరు పెట్టడానికి ఉన్న కారణం తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా లో ఉండే ద్రవిడియన్ వర్గంలోని చెంచు తెగకు చెందిన ఆదివాసులను స్పూర్తిగా తీసుకొని క్లీం కారా పేరు పెట్టినట్లు తెలిపారు.
Ram charan family emotional video
ఇక ఉపాసన మాట్లాడుతూ పాప చెంచు తెగలో ఒక భాగం అవ్వాలనీ ఆశిస్తున్నాను. పేరు ప్రఖ్యాతలను తనంతట తానే సాధించుకోవాలని అనుకుంటున్నాను. అయితే అది ఎటువంటి ఒత్తిడి వల్ల జరగకూడదు కష్టపడడం వల్ల జరగాలి పిల్లల పెంపకంలో ఇది ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. అలాగే ఈ వీడియోలో బిడ్డ పుట్టినప్పుడు ఆసుపత్రిలో కామినేని, కొణిదెల కుటుంబం సంతోషంతో భావోద్వేగం చెందిన క్షణాలను రామ్ చరణ్ మొదటి సారి తన బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఎలా ఫీలయ్యారో చూపించారు. దీనిని జోసెఫ్ రాధిక్ డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ వీడియో చిరంజీవి ఆయన భార్య సురేఖ అలాగే ఉపాసన తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్ కామినేని కూడా తమ మనసులోని మాటలను చెప్పారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.