Game Changer : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఈ నెల 30న ప్లాన్ చేశారు. ఐతే ఈ ఈవెంట్ ని ఫ్యాన్స్ మధ్యనే చేస్తారా లేదా ప్రైవేట్ గా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినిమా ఈవెంట్స్ కి కావాల్సిన పర్మిషన్ కష్టమే అని తెలుస్తుంది. ఐతే ఒకవేళ పర్మిషన్ తీసుకున్నా ఫ్యాన్స్ విషయంలో చిత్ర యూనిట్ తగిన బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పుష్ప 2 ఘటన వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంచడాలు ఉండవని అన్నారు. ఐతే ఎఫ్.డి.సీ చైర్మన్ గా దిల్ రాజు ఉండగా ఆయన నిర్మించిన సినిమా గేమ్ ఛేంజర్ సినిమాకు ఈ పర్మిషన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్స్, ప్రీమియర్ షోస్, టికెట్ ప్రైజెస్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఒకవేళ చరణ్ సినిమాకు పర్మిషన్ ఇస్తే సంక్రాంతికి వచ్చే మిగతా స్టార్ సినిమాలకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దిల్ రాజు ఎఫ్.డి.సీ చైర్మన్ గా పరిశ్రమ సమస్యలను కూడా సీఎం తో చర్చించి సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తారని ఆశిస్తున్నారు. ఐతే మెగా ఫ్యాన్స్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్స్ టైం లో వారు ఎంత కేర్ ఫుల్ గా చేసినా ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పొచ్చు.
Lemon Water : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే సి, విటమిన్ చాలా అవసరం. ఈ స్వీయ విటమి నువ్వు…
Zodiac Sign : నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శుక్ర గ్రహం. ఈ యొక్క శుక్రుడు ఐశ్వర్యానికి, లగ్జరీ…
ONGC : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ .. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్…
Zodiac Sign : రాబోయే సంవత్సరంలో ఐశ్వర్య ని తెచ్చి పెట్టే రాశులు ఏమిటో, అలాగే కీలక గ్రహాల సంచారం…
Anchor Suma : బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన వాక్ చాతుర్యంతో ఎన్నో…
Vishnu Priya : స్టార్ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించట్లేదు. హౌస్ లో ఆమె…
Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్..…
Sonu Sood : సమాజ సేవ చేయడానికి ఎలాంటి అధికారం లేదా పదవి అవసరం లేదని ప్రూవ్ చేశారు నటుడు…
This website uses cookies.