Game Changer Movie : గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. మెగా మోగిస్తే కానీ ఆ టార్గెట్ అందుకోవడం కష్టం బాసు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Game Changer Movie : గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. మెగా మోగిస్తే కానీ ఆ టార్గెట్ అందుకోవడం కష్టం బాసు..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Game Changer Movie : గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. మెగా మోగిస్తే కానీ ఆ టార్గెట్ అందుకోవడం కష్టం బాసు..!

Game Changer Movie : గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. శంకర్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలు అన్నీ కూడా సినిమాపై భారీ హైప్ ని ఏర్పరిచాయి. గేమ్ ఛేంజర్ సినిమా మొత్తం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. కేవలం డిజిటల్ రైట్స్ తోనే సినిమాకు 200 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైం వారు గేమ్ ఛేంజర్ సినిమాకు అన్ని భాషల్లో కలిపి 200 కోట్లు డిజిటల్ రైట్స్ కోసం ఇచ్చారట. మరోపక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల దాకా జరిగినట్టు తెలుస్తుంది. సో బడ్జెట్ మొత్తం ఈ రెండిటితోనే కవర్ అయ్యింది.

Game Changer Movie గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే మెగా మోగిస్తే కానీ ఆ టార్గెట్ అందుకోవడం కష్టం బాసు

Game Changer Movie : గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. మెగా మోగిస్తే కానీ ఆ టార్గెట్ అందుకోవడం కష్టం బాసు..!

Game Changer Movie 150 నుంచి 200 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్..

ఐతే సౌత్ మిగతా భాషలతో పాటు నార్త్ బెల్ట్ లో మొత్తం ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తానికే అమ్మినట్టు టాక్. ఇలా బిజినెస్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా కు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. Ram Charan Game Changer Movie Business Details , Ram Charan, Game Changer, Game Changer Business, Kiara Advani, Shankar

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది