ram charan gives clarity about ntr maala
Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇటీవల బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.ఈ సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ మధ్య బాండింగ్ మరింత బలపడింది. మన హీరోలలో దేవుడిపై భక్తి కూడా ఎక్కువగానే ఉంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల్లో కొంతమంది ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలో ఉంటారు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ హీరో.. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడు.
సినిమాలతో పాటు భక్తిభావం కూడా చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు రామ్ చరణ్.ఎంత బిజీగా ఉన్నా కూడా మాలధారణ విషయంలో మాత్రం చరణ్ కొన్నేళ్లుగా అదే నియమాలు పాటిస్తూ వస్తున్నాడు.ఈయనను చూసి మిగిలిన హీరోలు కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు అడుగులు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం మొదటిసారి ఆంజనేయ మాల వేశారు. రామ్‌చరణ్‌ను చూసిన తర్వాతే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై చరణ్ వివరణ ఇస్తూ.. అలాంటిదేం లేదు అని అన్నారు.
ram charan gives clarity about Jr ntr maala
తారక్ ఎప్పటినుంచో మాల వేసుకోవాలని అనుకుంటున్నాడు. అది ఇప్పటికి కుదిరింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడంలో చరణ్ పాత్ర ఏమి లేదని తెలుస్తోంది. ఇక దీనిపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మాల్ వేసుకోవడం అనేది వారి వ్యక్తిగతం.. అది ఒకారు చెపితేనో.. ఒకరిని చూస్తేనే రాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఏదేమైనా స్టార్ హీరోలు ఇలా భక్తిభావం వైపు అడుగులు వేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.త్వరలో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.