
Ram charan : రామ్ చరణ్ లుక్ చూసి స్టన్ అవుతున్న ఫ్యాన్స్.. ఏంటి ఇంత చేంజ్
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం peddi movie “పెద్ది” సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే, ఫ్యాన్స్‌లో సినిమాపై హైప్ పెరుగుతోంది. ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ట్రైనింగ్ సమయంలో తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ “Changeover for Peddi” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Ram charan : రామ్ చరణ్ లుక్ చూసి స్టన్ అవుతున్న ఫ్యాన్స్.. ఏంటి ఇంత చేంజ్
అందులో చరణ్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, ముసులుగా కనిపించే ఫిజిక్‌తో హాలీవుడ్ హీరోలా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుండటంతో, సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమా ద్వారా చరణ్ మరోసారి మాస్ పాత్రలో మెరవనున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్-స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం మరో హైలైట్‌గా మారింది.”పెద్ది” మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్‌తో నిరాశపరిచిన చరణ్ ఇప్పుడు పెద్దితో అలరించేందుకు సిద్ధమయ్యాడు.
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
This website uses cookies.