Ram Charan : RC16 నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..!
Ram Charan : శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రంతో ఫ్లాప్ మూటగట్టుకున్న రామ్ చరణ్ Ram Charan ఇప్పుడు Buchi Babu బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం మైసూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది మొదలైన ఈ మూవీ షూటింగ్ సెట్‌లోకి రామ్ చరణ్ కూడా అడుగు పెట్టాడు. రామ్ చరణ్ Ram Charan , జాన్వీ కపూర్‌ల janhvi kapoor మీద బుచ్చిబాబు సీన్లు చేసినట్టు తెలుస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మూడో షెడ్యూల్ జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుందని వార్తలు కూడా వచ్చాయి.
Ram Charan : RC16 నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..!
సుకుమార్‌తో కలిసి మేకర్స్ మొదటి రెండు షెడ్యూల్స్ రా ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు టీం ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిందని ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. త్వరలోనే అధికారికంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇదే నిజమైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ ఆసక్తిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీకపూర్‌కు దేవర తర్వాత తెలుగులో ఇది రెండో సినిమా.
ఆర్‌సీ 16 షూటింగ్‌ను జులైకల్లా పూర్తి చేసి.. దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. గేమ్జచేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. RC16 కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసాను ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆమె చెర్రీ సినిమాలోకి తీసుకుంటే మాత్రం..బ్లాక్ బస్టర్ హిట్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితిల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…
This website uses cookies.