
Ram Charan strong counter to rk roja
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళతారు. అయితే తనని కాని తన ఫ్యామిలీని కాని టచ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో వార్నింగ్ ఇచ్చిన చరణ్ తాజాగా వరంగల్ గడ్డ సాక్షిగా తన ప్రత్యర్ధులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అతి పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞత తెలుపుకోవాలని భావించిన మూవీ టీమ్ హన్మకొండ నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. మాస్ వార్నింగ్,
Ram Charan strong counter to rk roja
ముందుగా సైలెంట్‌గా స్టేజ్ మీదకు ఎక్కిన రామ్ చరణ్.. చిరంజీవిని ఎవరైనా ఏదైనా అనాలంటే.. అది కేవలం అభిమానులు, కుటుంబ సభ్యులు మాత్రమే అనాలి. సాధారణంగా చిరంజీవి చాలా నిశ్శబ్ధంగా ఉంటారు. బాగా సౌమ్యులు అని అంటుంటారు. ఆయన క్వైట్‌గా ఉంటేనే ఇంత మందిమి వచ్చాం. అదే ఆయన కొంచెం బిగించి..గట్టిగా మాట్లాడితే.. ఏమవుతుందో ఇతరులకు ఇంకా తెలియదు. ఆయన సైలెంట్‌గా ఉంటాడేమో. గుర్తు పెట్టుకోండి..వెనకాల ఉన్న మేమే మాత్రం మౌనంగా ఉండము. మేం అందరం ఉన్నాం. మేం క్వైట్‌గా ఉండము అని.. క్వైట్‌గానే చెబుతున్నాం అంటూ వరంగల్ సభలో రామ్ చరణ్ గర్జించారు.
Ram Charan strong counter to rk roja
అయితే రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అని అంతటా చర్చ నడుస్తుంది. కాగా, కొద్ది రోజుల క్రితం , కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన రోజా.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ .. ఈ ముగ్గురు అన్నాదమ్ముళ్లపై విమర్శలు గుప్పించారు. సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా సంచలన కామెంట్స్ చేశారుజ సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారని రోజా విమర్శించారు.ఇంతవరకు ఏ ఒక్కరికీ ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. ఇవి మనసులో పెట్టుకొనే చరణ్ గట్టిగా వార్పింగ్ ఇచ్చాడని చెబుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.