Chiranjeevi : చిరంజీవిను మళ్లీ బుల్లి తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగాస్టార్ చిరంజీవి కి నిరాశ ఎదురయింది. ఆ కార్యక్రమం నాగార్జున చేసిన సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, కానీ చిరంజీవి టేక్ ఓవర్ చేసిన సమయంలో మాత్రం దారుణమైన రేటింగ్ నమోదయింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఎప్పుడు టీవీ వైపు చూడ వద్దని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన సినిమాలు చేస్తే చాలని బుల్లి తెరపై కనిపించాల్సిన అవసరం లేదని మెగా ఫ్యాన్స్ చాలా బలంగా వాదిస్తున్నారు.
ఈ సమయంలో తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు మన మెగా బాస్ చిరంజీవిని సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి. గత నాలుగు సీజన్లుగా నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గ వ్యవహరిస్తున్నాడు. కానీ వచ్చే సీజన్ కి తాను అందుబాటులో ఉండను అంటూ మందస్తుగానే ప్రకటించేశాడు. దాంతో నిర్వాహకులు కొత్త హోస్ట్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, రానా లతో పాటు మెగాస్టార్ చిరంజీవి పేరు ని కూడా బిగ్ బాస్ వారు పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
పెద్ద ఎత్తున చిరంజీవికి రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఈ కార్యక్రమం యొక్క హోస్ట్ పదవికి ఆయన్ని తీసుకు రావాలని భావిస్తున్నారట. కానీ ఇప్పటి వరకు బిగ్బాస్ యొక్క హోస్టింగ్ కి మెగాస్టార్ చిరంజీవి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మెగా ఫాన్స్ మాత్రం ఈ సమయంలో వద్దు బాబోయ్ అన్నట్లుగా చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తే చాలు ఇలా బుల్లి తెరపై కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని చిరంజీవికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి చిరంజీవి నిర్ణయం ఏంటి అనేది చూడాలి.