Ram Charan : ఫ్లాప్ సెంటిమెంట్ నుండి రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టెక్క‌నున్నాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan : ఫ్లాప్ సెంటిమెంట్ నుండి రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టెక్క‌నున్నాడా?

Ram Charan: సినిమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది స్టార్స్‌కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల‌లో ఆ సెంటిమెంట్స్‌కి భ‌య‌ప‌డిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ని ఓ సెంటిమెంట్ వ‌ణికిస్తుంది. రీసెంట్ గా “ఆర్ఆర్ఆర్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 July 2022,4:30 pm

Ram Charan: సినిమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది స్టార్స్‌కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల‌లో ఆ సెంటిమెంట్స్‌కి భ‌య‌ప‌డిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ని ఓ సెంటిమెంట్ వ‌ణికిస్తుంది. రీసెంట్ గా “ఆర్ఆర్ఆర్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

రాంచరణ్ కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ‌లితంపై ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇక్క‌డే ఓ సెంటిమెంట్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. టాలీవుడ్‌ స్టార్‌ రామ్ హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి రూపొందించిన చిత్రం జులై 14న విడుదల అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకులు నేరుగా మన హీరోలుతో రూపొందించిన చిత్రాల ఫ్లాప్ విష‌యంలో ఓ చర్చ న‌డుస్తుంది. ఇంతకు ముందు ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్….మన స్టార్ హీరో మహేష్ తో స్పైడర్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

can ram charan breaks the sentiment

can ram charan breaks the sentiment

Ram Charan : సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

అలాగే విజయ్ దేవరకొండతో తమిళ దర్శకుడు స్టైయిట్ తెలుగు సినిమా నోటా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు లింగుస్వామి మన స్టార్ రామ్ తో ది వారియర్ చేసారు. ఆ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా భాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అని తేలింది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. కాని శంక‌ర్ కి ఇటీవలి కాలంలో ఒక్కహిట్ లేదు. మ‌రి రామ్ చ‌ర‌ణ్‌తో హిట్ అనేది కొడ‌తాడా లేదా అనేది చ‌ర్చనీయాంశంగా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది