Home » Entertainment » Ram Charan Who Planned Hard
Entertainment

Ram Charan : గట్టిగా ప్లాన్ చేసిన రామ్ చరణ్ , ఫ్యాన్స్ కి పండగే !

Authored By
Breaking News
The Telugu News | Published on: May 8, 2023, 2:00 pm
Advertisement

Ram Charan : ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టైం అద్భుతంగా ఉంది. ఒకపక్క సినిమా పరంగా “RRR”తో ప్రపంచాన్ని షేక్ చేసి… తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చరణ్ మరోపక్క చాలా సంవత్సరాల తర్వాత తండ్రి కాబోతున్నారు. భార్య ఉపాసన గర్భవతి. జులై నెలలో… బిడ్డకు జన్మనివ్వనుంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఆస్కార్ దాకా చరణ్ ఎదుగుదల అందరూ గర్వించదగ్గ రీతిలో ఉంది. ప్రస్తుతం చరణ్ తన కెరియర్ లో 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు.

Advertisement

Ram Charan who planned hard

“గేమ్ చేంజర్” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అభిమానులకు అదిరిపోయే రీతిలో… క్రీడా నేపథ్యంలో కంటెంట్ కలిగిన స్టోరీని చరణ్ ఓకే చేయడం జరిగిందట. ఈ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా చేయబోతున్నారట. “RRR”తో చరణ్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ క్రెడిట్ కావడంతో… ఈ రకంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Advertisement

దీంతో ఇంగ్లీష్ వర్షన్ కూడా రెడీ చేసే తరహాలో బుచ్చిబాబు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు… త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఫస్ట్ టైం ప్రపంచ స్థాయిలో చరణ్ సినిమా తెరకెక్క బోతుంది అంటే కచ్చితంగా ఇది ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్తని చెప్పవచ్చు. కుస్తీ పోటీల నేపథ్యంలో సినిమా ఉండబోతుందని.. చరణ్.. ఈ సినిమా కోసం భారీగా వర్కౌట్స్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి