
Ram Gopal Varma beauty gets a chance in bigg boss
Ram Gopal Varma : బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈ షోకి ఆదరణ పెరుగుతూ వస్తుండగా, ప్రస్తుతం సీజన్ 6 జరుపుకుంటుంది. ఈ సీజన్‌లో ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారా అనే దానిపై అనేక ఆసక్తికర వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. భారీ ఎత్తున ప్రేక్షకులు అంచనాలు పెంచుకుని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి నుంచి ఉదయ భాను షో లో ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమెకు అత్యధిక పారితోషికం అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం బిగ్ బాస్ లో ఉదయభాను ఉండేది అనుమానమే అంటున్నారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 6లో వర్మ కంపెనీకి చెందిన ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇనాయ సుల్తానా అనే నటి గతంలో ఎన్నో సార్లు వర్మ తో వేడుకల్లో పాల్గొన్నది.. ఆయనతో డాన్స్ చేసిన వీడియోలు మరియు వర్మ ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే చాలా మంది ఎవరు ఈ ఇనాయ సుల్తానా అంటూ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. వర్మ వలన బాగా పాపులర్ అయిన అరియానా, శ్రీ రాపాక బిగ్ బాస్ హౌజ్‌లో తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఆయన కంపెనీ నుండి వచ్చే ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో చాలా బోల్డ్ గా ఉంటారు అనేది బిగ్ బాస్ నిర్వాహకుల అభిప్రాయం కావచ్చు. అందుకే వారిని తీసుకుంటారు.
Ram Gopal Varma beauty gets a chance in bigg boss
ఇనాయ సుల్తానా ఏ స్థాయి అందాల ఆరబోత చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి కాగా సీజన్ 6 సెప్టెంబర్ నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 6 ను అక్కినేని నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సోషల్ మీడియాలో పార్టిసిపెంట్స్ వీళ్లే అంటూ ఇప్పటికీ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కన్ఫార్మ్ గా మాత్రం కొంతమందిని క్వారైంటైన్ కి పంపించినట్లుగా సమాచారం తెలుస్తోంది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.