
Ram Gopal Varma dead said by varma
RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపులు అవుతున్నాయి. అయిన తన సినిమాలు విడుదల చేయకుండా మాత్రం ఆగడం లేదు. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా ‘మా ఇష్టం’ సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి.
పోటీగా సినిమాలు చేస్తున్న వర్మ తాజాగా తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంత మంచి సినిమాలు చేసిన వర్మ మీకు ఏమవుతాడు అని అడగగా, ఆ వర్మ చనిపోయాడు అని చెప్పుకొచ్చాడు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్‌లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు. ప్రమోషన్‌కి తన ఇద్దరు హీరోలతో కలిసి వచ్చాడు వర్మ.
Ram Gopal Varma dead said by varma
రీసెంట్‌గా వర్మ.. దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్ కు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాక. ‘కేజీఎఫ్2’ సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని… వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు నెట్టేసి, కొత్త పరిశ్రమకు జీవం పోశారని.. దాని పేరే ‘కేజీఎఫ్ 2’ అని ప్రశంసించారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.