Ram Gopal Varma : రామ్ గోపాల్ వ‌ర్మ చ‌చ్చిపోయాడా.. ఈ విష‌యం అన్న‌ది ఎవ‌రో కాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : రామ్ గోపాల్ వ‌ర్మ చ‌చ్చిపోయాడా.. ఈ విష‌యం అన్న‌ది ఎవ‌రో కాదు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 May 2022,3:30 pm

RGV : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు ఒక‌ప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇప్పుడు మాత్రం వ‌రుస ఫ్లాపులు అవుతున్నాయి. అయిన త‌న సినిమాలు విడుద‌ల చేయ‌కుండా మాత్రం ఆగ‌డం లేదు. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా ‘మా ఇష్టం’ సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి.

పోటీగా సినిమాలు చేస్తున్న వ‌ర్మ తాజాగా త‌న మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్ర‌మంలో అంత మంచి సినిమాలు చేసిన వ‌ర్మ మీకు ఏమ‌వుతాడు అని అడ‌గ‌గా, ఆ వ‌ర్మ చ‌నిపోయాడు అని చెప్పుకొచ్చాడు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్‌లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు. ప్ర‌మోష‌న్‌కి త‌న ఇద్ద‌రు హీరోల‌తో క‌లిసి వ‌చ్చాడు వ‌ర్మ‌.

Ram Gopal Varma dead said by varma

Ram Gopal Varma dead said by varma

Ram Gopal Varma : వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్..

రీసెంట్‌గా వ‌ర్మ‌.. దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్ కు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాక‌. ‘కేజీఎఫ్2’ సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని… వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు నెట్టేసి, కొత్త పరిశ్రమకు జీవం పోశారని.. దాని పేరే ‘కేజీఎఫ్ 2’ అని ప్రశంసించారు.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది