RGV : నేను చిరంజీవి అభిమానిని.. కానీ జగన్ ముందు చిరంజీవి ఎంత.. మెగాస్టార్‌పై ఆర్జీవీ సెటైర్
RGV : రామ్ గోపాల్ వర్మ.. ఆర్జీవీ గురించి తెలుసు కదా. ఆర్జీవీ ఎప్పుడు ఎవరి గురించి ఎలా మాట్లాడుతాడో తెలియదు. అందుకే ఆయన్ను ఎవ్వరూ గెలకరు. గెలికితే ఇక అంతే.. మామూలుగా ఉండదు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే.. వాళ్ల అంతు చూస్తాడు ఆర్జీవీ. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ పై పలు వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమాపై ఆయన కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను నిజంగానే జగన్ మీద తీశారా? కావాలని జగన్ ఈ సినిమా తీయించారా? మీకు ఎంత ప్యాకేజీ అందింది అని మీడియా అడగడంతో నాకు నచ్చకుండా నేను ఒకదాన్ని సపోర్ట్ చేస్తే నాకు ప్రతిఫలం ఇస్తే నేను తీసుకుంటాను. కానీ.. నేను డైరెక్ట్ గా చెబుతున్నా.. నాకు నచ్చి, జగన్ మీద అభిమానంతో తీశాను. కాబట్టి ఇది ప్యాకేజీ అంటూ ఏం లేదు అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరు వాళ్లకు ఉన్న ఆసక్తి ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంటారు. సినిమా అనేది క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది. కొందరు ఒక పార్టీని లైక్ చేస్తారు. ఇంకొందరు ఇంకో మనిషిని లైక్ చేస్తారు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు.. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అంటే టీడీపీ అంటే మీకు ఎందుకు ధ్వేషం అని అడుగుతారు. దీంతో నాకు టీడీపీ గురించి తెలియదు. వైసీపీ గురించి తెలియదు. పార్టీలకు, ప్రభుత్వాలకు ఈ సినిమాతో సంబంధం లేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర నుంచి నాకు మరో ఇంప్రెషన్. టోటల్ ఏపీలో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. అది మీరు రాయొచ్చు.. సినిమా తీయొచ్చు.. డిబేట్ పెట్టొచ్చు అంటాడు ఆర్జీవీ.
RGV : ఎవరికి ఏది కన్వీనియెంట్ గా ఉంటేనే అదే నిజంలా చెబుతారు
ఎవరికి ఏది కన్వీనియెంట్ గా ఉంటేనే అదే నిజంలా చెబుతారు. వాళ్లు నమ్మిన నిజమే చెబుతారు. ఏ సినిమాకు సంబంధించి మీరు అంటన్నారు. వంగవీటికి సంబంధించి ఎవరు ఏం చెప్పినా నేను తీయలేదు. నేను నమ్మిందే నేను తీశా. అలాగే వ్యూహం సినిమా కూడా అంతే. నాకు తెలిసింది.. నేను నమ్మింది తీశాను. జగన్ ను నేను మూడు సార్లు కలిశాను. అప్పుడు నాకు ఏర్పడిన ఇంప్రెషన్ ప్రకారమే నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నాను అని చెబుతాడు వర్మ.