Ram Pothineni : రామ్ కి కొత్త దర్శకుడితో వర్కౌట్ అవుతుందా ..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 9 February 2021, 12:21 pm

Ram Pothineni: రామ్ రెడ్ మూవీ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన లుక్ ను కిస్మత్ ను మార్చుకున్న రామ్ ప్రేక్షకుల పల్స్ ను పసిగట్టి వారికి తగ్గట్లుగా సినిమాలను చేస్తున్నాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక రెడ్ సినిమాలో రామ్ కు ఫిదా అవ్వని వాళ్ళు ఎవరు ఉండరంటే నమ్మరేమో. ద్విపాత్రాభినయంలో రామ్ ఇరగదీశాడు. రామ్ తో జోడీకట్టిన నీవేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యార్ ల అందాలు ప్లస్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ ను అందుకుంది రెడ్ మూవీ. పెట్టిన పెట్టుబడికి మించి వసూళ్లను అందుకుంది. రెడ్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న రామ్ మరో కొత్త ప్రయోగం చేసేందుకు సై అంటున్నాడు.

Ram Pothineni

Ram Pothineni

ఇప్పుడు ప్రేక్షకులందరూ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే కన్నేశారు. రెడ్ మూవీ లో ద్విపాత్రాభినయంతో మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు తన వైపుకు తిప్పుకున్న ఈ ఎనర్జిటిక్ స్టార్ త్రిపాత్రాభినయం చేసేందుకు డిసైడ్ అయ్యాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. కరోనా సమయం లో చాల మంది దర్శకులు రామ్ ను సంప్రదించిన దేనికి ఓకే చెప్పలేదు. మారుతి, సురేందర్ రెడ్డి లాంటి కమర్షియల్ దర్శకులతో చర్చలు జరిపినా వాటిలో వేటికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఎన్నో కథలు విన్న రామ్ కొత్త దర్శకుడితో జోడి కట్టేందుకు రెడీ అవుతున్నాడని టాక్. కరోనా లాక్ డౌన్ నుంచి రామ్ తోనే ఈ కొత్త దర్శకుడు ప్రయాణిస్తున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి .

Ram Pothineni : రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని టాక్ వస్తోంది.

అందులో రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని టాక్ వస్తోంది. రెడ్ లో మొదటి సారిగా చేసిన ద్విపాత్రాభినయం హిట్ కావడం తో ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రేక్షకులకు సరికొత్త కిక్ ఇస్తానంటున్నాడు. ఏదిఏమైనా ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ఎంచుకునే కథల్లో దమ్ము ఉంటోంది. అది నచ్చేనేమో యువ దర్శకుడికి ఓకే చేశాడని అనుకుంటున్నారు. మరి రామ్ కి కొత్త దర్శకుడితో వర్కౌట్ అవుతుందా… లేదా అన్నది తెలుసుకోవాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే .

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp