Sudheer – Rashmi : సుధీర్ రష్మీ గుట్టు రట్టు.. ఎక్కడెక్కడో తిరిగారట!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 20 March 2021, 10:40 am

Sudheer – Rashmi : బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఇప్పటికీ జనాలను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వారిద్దరి మధ్య ఏమీ లేదని తెలిసినా, తామిద్దరం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు చెప్పినా కూడా జనాలు మాత్రం ఆ ఇద్దరినీ జోడిగానే చూస్తుంటారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అని అభిమానులు అడుగుతూనే ఉంటారు. వారు మాత్రం అలాంటి కామెంట్లను ఖండిస్తూనే ఉంటారు.

అయితే తెర మీదకు వచ్చే సరికి కెమిస్ట్రీని ఓ రేంజ్‌లో పండిస్తుంటారు. రష్మీ సుధీర్ మధ్యలో ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. వారు కూడా అంతే స్థాయిలో నటిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే వారంప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో అదిరిపోయే స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో సుధీర్ పెళ్లిని చెడగొట్టేందుకు గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ఓ రేంజ్‌లో ప్లాన్ వేశారు.

Ram prasad about Sudigali Sudheer and Rashmi

Ram prasad about Sudigali Sudheer and Rashmi

Sudheer – Rashmi : సుధీర్ రష్మీ గుట్టు రట్టు..

సుధీర్‌కు పెళ్లి జరిగిపోతోంటే.. దాన్ని ఆపేందుకు శ్రీను, రాం ప్రసాద్‌లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రష్మీని రంగంలోకి దించుతారు. రష్మీ సుధీర్ మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా రాం ప్రసాద్ వాటిని మార్చి చెబుతుంటాడు. వాళ్లిద్దరూ చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో.. పెళ్లి అవుతున్నందుకు ఏడ్చేస్తున్నారు.. వారిద్దరూ ఎక్కడెక్కడో తిరిగారు.. పార్టీలు పబ్‌లు అంటూ రాం ప్రసాద్ చెబుతూ ఉండగానే సుధీర్ ఉలిక్కి పడ్డాడు. మొత్తానికి స్కిట్లో భాగంగా ఇలాంటివి రాస్తారో నిజంగానే జరుగుతాయో అని చూసే ప్రేక్షకులు మాత్రం ఆ జంట రియల్ జంట అని భ్రమపడుతుంటారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి