Samantha : రంగస్థలం ఫస్ట్ చాయిస్ సమంత కాదట.. ఆ హీరోయిన్ చేసి ఉంటే దశ తిరిగేది..!
Samantha : సుకుమార్ డైరెక్షన్‌లో సమంత, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఒక చెవిటి వాడి పాత్రలో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. పల్లెటూరి యువతిగా సమంత అదరగొట్టింది. ఈ సినిమా కథ ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఇందులో సమంత పాత్రకు మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. అయితే ఈ పాత్రకు తొలుత సమంత బదులు కీర్తి సురేష్‌ని అనుకున్నారట. ఆ టైంలో కీర్తి సురేష్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో ఈ పాత్రను వదులుకొనిందట.
ఇక ఈ పాత్రను ఆమె వదులుకోవడం ఆమె కెరీర్ కె బిగ్గెస్ట్ మైనస్ అయింది. రంగస్థలంలో కీర్తి సురేష్ ఆ పాత్ర చేసి ఉంటే వేరేలా ఉండేదని కొందరు అంటున్నారు. ఈ సినిమా చేసి ఉంటే ఆ ఫ్లాప్స్ తప్పించుకుని సమంత లా పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ దక్కించుకునేది..ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ కధల ఎంపిక ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జనాలు. కీర్తి సురేష్ సినిమాలు చేస్తున్నా కూడా మంచి విజయాలు సాధించడం లేదు. ఈ అమ్మడు సర్కారు వారి పాట చిత్రంతో ఓ మాదిరి విజయాన్ని అందుకుంది.

Rangasthalam first choice is not Samantha
Samantha : మంచి చాన్స్ మిస్..
ఇక కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. . కీర్తి పెళ్లి వార్తలన్నీ ఫేక్ అని, ఎవరో కావలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని, మహానటి పెళ్లి వార్తల్ని కొట్టిపడేశారు. కీర్తి సురేష్ ఫోకస్ మొత్తం ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ పైనే ఉందని, ఆమె కుటుంబంలో అసలు కీర్తి పెళ్లి చర్చలే జరగడం లేదని అంటున్నారు. దీంతో కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేలిపోయింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కోలీవుడ్ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కీర్తి సురేష్ లు డేటింగ్ చేస్తున్నారనే టాక్ వినిపించింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపించింది.