Chiranjeevi : బుల్లితెరపై ‘జబర్దస్త్’ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ వెండితెరపైనా మెరిసింది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో రష్మి గౌతమ్ సిల్వర్ స్క్రీన్‌పైన మెరిసినప్పటికీ తర్వాత బుల్లితెరకే పరిమితమైంది. అయితే, మంచి ఆఫర్ వస్తే మాత్రం వెండితెరపైన కనిపించేందుకు రష్మి గౌతమ్ సిద్ధంగానే ఉంది.‘జబర్దస్త్’ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మి గౌతమ్.. టాప్ యాంకర్‌గా దూసుకుపోతోంది.కాగా, ఈ అందాల ముద్దుగుమ్మకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చాన్స్ వచ్చిందని సినీ వర్గాల టాక్.
మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్.. ‘భోళా శంకర్’లో రష్మి గౌతమ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘భోళా శంకర్’ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తోంది.జనరల్‌గా మెగాస్టార్ సినిమాల్లో చిన్న పాత్ర వస్తే చాలు.. అని భావించే సందర్భంలో యాంకర్ రష్మి గౌతమ్‌కు స్పెషల్ సాంగ్‌లో కనిపించే అవకాశం వచ్చిందన్న వార్త విని చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సాంగ్‌ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సాంగ్‌లో ఫుల్ మాస్ స్టెప్స్ ఉండబోతున్నాయని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజమెంత ఉందో.. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇకపోతే మెగాస్టార్ చిరు.. టాలీవుడ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ ఫిల్మ్ షూట్ పూర్తి చేసుకున్న చిరంజీవి..ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ చిత్రాల షూటింగ్‌లో ప్యారలల్‌గా పాల్గొంటున్నారు. ఈ సినిమాల తర్వాత చిరు బాబీ డైరెక్షన్‌లో ‘మెగా 154’చిత్రంలో నటించనున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. చిరుకు జీడీగా కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.