Home » Entertainment » Rashmika Mandanna And Vijay Devarakonda Back To Hyderabad
Entertainment

Rashmika Mandanna : కలిసి వెళ్లలేదు కానీ రాత్రి సమయంలో కలిసి వచ్చిన రౌడీ స్టార్‌, రష్మిక మందన్నా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 13, 2022 10:45 am
Advertisement

Rashmika Mandanna : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక మందన్నా మాల్దీవ్స్ కి వెళ్లారు. ఇద్దరు కలిసి వెళ్లారా… ఇద్దరు వేరు వేరుగా వెళ్లారా అనే విషయం క్లారిటీ లేదు.. ఇద్దరు కలిసి అక్కడ హాలీడేస్ ని ఎంజాయ్ చేశారా లేదంటే వేరు వేరుగానే అక్కడ ఉన్నారా అనేది క్లారిటీ లేదు. కానీ ఇద్దరి మధ్య ఏం లేదు అంటే మాత్రం జనాలు నమ్మే పరిస్థితి అస్సలు లేదు. ఇద్దరు ఒకే రోజు మాల్దీవ్స్ కి వెళ్లడం ఏంటీ అంటూ చర్చ జరుగుతున్న సమయంలోనే ఇద్దరు కూడా ఒకే రోజు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆ విషయం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పోయే సమయంలో ఇద్దరు విడి విడిగానే వెళ్లారు.. కానీ వచ్చే సమయంలో మాత్రం కలిసి వచ్చారు అంటూ కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

సోషల్‌ మీడియాలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ల యొక్క ప్రేమ వ్యవహారం గురించి పీక్స్ లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలకు తగ్గట్లుగానే వీరిద్దరు ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. మాల్దీవ్స్ నుండి రాత్రి సమయంలో విమానం దిగారు అని సమాచారం అందుతోంది. ఇద్దరు కలిసి రాత్రి సమయంలో విమానం దిగడం వల్ల మీడియా వారి కంట పడకుండానే తుర్రుమన్నారట. తెల్లవారు జామున ఇద్దరు కలిసి హైదరాబాద్‌ లో ల్యాడ్‌ అవ్వడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా వీరిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

rashmika mandanna and vijay devarakonda back to Hyderabad

Advertisement

అయితే రష్మిక మాత్రం ఒకింత నిరుత్సాహంగా ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు మరియు ఆమెను చూసిన మీడియా వారు మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది అనే విషయంలో క్లారిటీ లేదు.. కానీ అసలు ఏదో జరిగే ఉంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు లో స్టార్‌ హీరో హీరోయిన్ గా ఉన్న వీరిద్దరు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటే కెరీర్‌ పై ప్రభావం మారే అవకాశం ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీరిద్దరు తమ ప్రేమను బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించడం లేదా అంటూ కొందరు కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి