Home » Entertainment » Rashmika Mandanna Can Act Like Soundarya In Her Biopic
Entertainment

Soundarya biopic : సౌందర్య బయోపిక్ లో నటించే సత్తా రష్మిక మందన్న కి ఎక్కడుంది ..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: February 13, 2021 2:47 pm
Advertisement

Soundarya biopic : సౌందర్య బయోపిక్.. రష్మిక మందన్న మంచి ఊపు మీద ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏ అవకాశం వచ్చిన వదలడం లేదు. అన్నీ నాకే కావలన్నట్టుగా వచ్చిన అవకాశాన్ని అస్సలు వదలడం లేదు. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో నటించి భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావడమే కాదు హాట్ టాపిక్ కూడా అయింది. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న భీష్మ సినిమా తో మరో భారీ హిట్ అందుకుంది. దాంతో రష్మిక మందన్న క్రేజ్ టాలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోయింది.

Advertisement

ఈ నేపథ్యంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ .. బాలీవుడ్ మేకర్స్ కూడా రష్మిక మందన్న డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కాగా రష్మిక మందన్న ప్రస్తుతం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో పుష్ప రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లోనూ రెండు భారీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మిషన్ మజ్ఞు అన్న సినిమా సెట్స్ మీదకి వచ్చింది. త్వరలో అమితాబ్ బచ్చన్ తో చేసే సినిమా పట్టాలెక్కబోతోంది.

rashmika mandanna can act like Soundarya in her biopic

Advertisement

Soundarya biopic : సౌందర్య లాగా రష్మిక మందన్న నేచురల్ పర్ఫార్మెన్స్ చేస్తుందా..?

అలాగే కోలీవుడ్ లో కూడా రష్మిక మందన్న వరసగా సినిమాలకి సైన్ చేస్తోంది. ఇప్పటికే కార్తి తో సుల్తాన్ అన్న సినిమా చేసింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న రెమ్యూనరేషన్ కూడా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్న సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉందన్న మాట చెప్పి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ముఖ కవళికలు పరంగా సౌందర్య ని రష్మిక మ్యాచ్ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక తనలాగా నేచురల్ పర్ఫార్మెన్స్ చేస్తుందా..? అన్నది అనుమానమే అంటున్నారట. చూడాలి మరి నిజంగా రష్మిక కి ఆఛాన్స్ వస్తుందా లేదా..!

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి