Pushpa : పుష్ప సెట్ లో విషయాలను లీక్ చేసిన రష్మిక మందన్న ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa : పుష్ప సెట్ లో విషయాలను లీక్ చేసిన రష్మిక మందన్న ..?

Pushpa : పుష్ప .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మహా ఊరమాస్ గా కనిపించబోతున్న లేటెస్ట్ సినిమా. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 200 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమా తెరకెక్కడం ఇదే మొదటిసారి. తెలుగుతో పాటు […]

 Authored By govind | The Telugu News | Updated on :10 February 2021,11:20 am

Pushpa : పుష్ప .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మహా ఊరమాస్ గా కనిపించబోతున్న లేటెస్ట్ సినిమా. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 200 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమా తెరకెక్కడం ఇదే మొదటిసారి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

pushpa set news are leaked by rashmika mandanna

pushpa-set-news-are-leaked-by-rashmika-mandanna

ఇక ఇప్పటికే పుష్ప సినిమా ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా సెట్ లో ఉన్న అల్లు అర్జున్ లుక్స్ కొన్ని ఇటీవల లీకై సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది పుష్ప టైటిల్ తో పాటు ఒకే ఒక్క అల్లు అర్జున్ ఫస్ట్ లుక్. కాని ఆ తర్వాత ఏదో లీక్ వస్తూనే ఉంది. ఆ మధ్య రంప చోడవరం మారేడుపల్లి ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని పిక్స్ లీకయ్యాయి. ఈ విషయంలో సుకుమార్ యూనిట్ సభ్యులకి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

Pushpa : ఆ రోజంతా పడిన కష్టం అలా ఎగిరిపోతుందని తెలిపింది రష్మిక మందన్న..!

కాగా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప సెట్ లో జరుగుతున్న విషయాలను బయటకి లీక్ చేసింది. తెల్లవారు జామున 5 గంటలకి షూటింగ్ మొదలు పెడుతున్నామని కేవలం మేకప్ చేసుకునేందుకే 2 గంటలు పడుతుందని తెలిపింది. ఇక తెల్లవారు జామున 5 గంటలకి మొదలు పెట్టిన షూటింగ్ సాయంత్రం 7గం.30నిముషాల వరకు సాగుతుందని చెప్పుకొచ్చిందని తెలిపింది. సుకుమార్ ప్రతీ షాట్ ని చాలా పక్కాగా చూసుకుంటున్నాడని .. ఒకరకంగా చాలా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ అయిన రష్ చూసుకుంటే ఆరోజంతా పడిన కష్టం అలా ఎగిరిపోతుందని తెలిపింది రష్మిక మందన్న. అంటే పుష్ప సినిమా కి సుకుమార్ దాదాపు 15 గంటలు కేవలం షూటింగ్ కోసమే కేటాయించాడని తెలుస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది