Rashmika Mandanna : పుష్ప 2 చేసే టైమ్ లో రెండు సినిమాలు చేయొచ్చు.. రష్మికకు సుకుమార్ అన్యాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : పుష్ప 2 చేసే టైమ్ లో రెండు సినిమాలు చేయొచ్చు.. రష్మికకు సుకుమార్ అన్యాయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 December 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : పుష్ప 2 చేసే టైమ్ లో రెండు సినిమాలు చేయొచ్చు.. రష్మికకు సుకుమార్ అన్యాయం..!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న యానిమల్ తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకోగా పుష్ప 2 తో మరోసారి అదే రేంజ్ లో తన సత్తా చాటబోతుంది. అల్లు అర్జున్ సరసన పుష్ప 1 లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టిన రష్మిక పార్ట్ 2 లో కూడా ఏమాత్రం తగ్గలేదని అనిపిస్తుంది. ఐతే పుష్ప 2 సినిమా సుకుమార్ దాదాపు 3 ఏళ్లు తీశాడు. సినిమాలో నటించిన యాక్టర్స్ అంతా కూడా తమ డేట్స్ ని అడిగినంత కాలం ఇచ్చారు. వారిలో రష్మిక కూడా ఉంది.

మామూలుగా అయితే ఒక సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నాక రష్మిక 70 నుంచి 1000 రోజుల్లో సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ పుష్ప 2 కోసం ఏకంగా 170 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిందని తెలుస్తుంది. అంటే పుష్ప 2 సినిమా ఒకటే అయినా రెండు సినిమాల కాల్ షీట్స్ ఇచ్చేసింది అన్నమాట. మరి అలా అని రెమ్యునరేషన్ ఏమైనా డబుల్ తీసుకుందా అంటే అలా ఏం లేదు. పుష్ప 1 కి ఇచ్చినట్టే ఇచ్చారని తెలుస్తుంది.

Rashmika Mandanna పుష్ప 2 చేసే టైమ్ లో రెండు సినిమాలు చేయొచ్చు రష్మికకు సుకుమార్ అన్యాయం

Rashmika Mandanna : పుష్ప 2 చేసే టైమ్ లో రెండు సినిమాలు చేయొచ్చు.. రష్మికకు సుకుమార్ అన్యాయం..!

Rashmika Mandanna 250 కోట్ల బడ్జెట్ తో..

ఈ లెక్కన చూస్తే దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మైత్రి మేకర్స్ రష్మికకు చాలా అన్యాయం చేసినట్టే అని చెప్పొచ్చు. సినిమా ను 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుండగా పుష్ప 2 బిజినెస్ కూడా భారీగానే జరిగింది. సినిమాపై ఉన్న ఈ పాజిటివ్ బజ్ కి తగినట్టుగా రిజల్ట్ వస్తే మాత్రం పుష్ప 2 సంచలనాలు వేరే లెవెల్ లో ఉంటాయి.

పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలానే అనిపిస్తుంది. మరి సినిమా ఏం చేస్తుంది అన్నది తెలియాలంటే మరో 4 రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ లో కూడా పుష్ప 2 మేనియా కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ లో సినిమా అదరగొట్టేస్తుంది. సినిమా నార్త్ బెల్ట్ నుంచి భారీ వసూళ్లు రాబట్టేలా ఉంది. Rashmika Mandanna give Double Call sheets for Pushpa 2 , Rashmika Mandanna, Pushpa 2, Animal, Allu Arjun, Sukumar, Srivalli, Mytri Movie Makers

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది