Rashmika Mandanna : ర‌ష్మిక చేతిపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Authored By Sam C | The Telugu News | Published on: September 20, 2022, 10:30 am

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో కుర్రాళ్ల మ‌నసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మందాన నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఎంత పాపులారిటీ పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న శ్రీముఖి వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చ‌కుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.ఇన్నాళ్లు టాలీవుడ్‌లో ర‌చ్చ చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ లో రష్మిక జోరు చూసి అక్కడ భామలు షాక్‌ అవుతున్నారు. శ్రీవల్లి జోరుకి బేజార్‌ అవుతుండటం విశేషం.

Rashmika Mandanna : టాటూ స్టోరీ..

ప్రస్తుతం రష్మిక మందన్నా తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. తమిళంలో `వారసుడు` చిత్రాలు చేస్తుంది. హిందీలో `గుడ్‌బై`, `మిషన్‌ మజ్ను`, `యానిమల్‌` సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మిక మందన్నా `ఆషిఖీ 3`లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. `ఆషిఖీ` సినిమాలు బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ సిరీస్‌గా నిలిచింది. మహేష్‌ భట్‌ దర్శకత్వంలో మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా కథాంశంతో 1990లో వచ్చిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే, మళ్లీ ఇరవై ఐదేళ్ల తర్వాత ఆదిత్య రాయ్ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన `ఆషిఖీ2` సైతం సంచలన విజయం సాధించింది. మూడో సిరీస్ రూపొందించే ప్లాన్ చేస్తుండ‌గా, ఇందులో ర‌ష్మిక‌నే న‌టించ‌నుంద‌ని టాక్.

Rashmika Mandanna How She Gets Tattoo On Her Right Hand

Rashmika Mandanna How She Gets Tattoo On Her Right Hand

ర‌ష్మిక‌కి సంబంధించి తాజాగా ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది. ర‌ష్మిక‌ కుడి చేతిపై ఒక టాటూ ఉంటుంది.. ప్రస్తుతం “గుడ్ బై” చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఎంతో బిజీగా ఉంది. ఈ తరుణంలోనే ఆమె చేతికి ఉన్న పచ్చబొట్టు బయటపడింది. చేతిపై ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.. “ఈ రీప్లేసబుల్ “అని రాసి ఉంది.. అంటే మీ జీవితంలో మిమ్మల్ని ఎవరూ భర్తీ చేయలేరు అని దీనికి అర్థం. ఈ పదం యొక్క మరో అర్థం “అది భర్తీ చేయబడదు అని”.. ర‌ష్మిక టాటూ ప‌లుమార్లు బ‌య‌ట‌ప‌డ్డా కూడా తాజాగా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌ పుష్ప 2లో కూడా నటిస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp