Rashmika Mandanna: రెడ్ డ్రెస్‌లో రగిలిస్తున్న రష్మిక మందన్న..లేటెస్ట్ పిక్స్ వైరల్

Authored By vamana sai | The Telugu News | Published on: September 23, 2021, 8:50 am

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య సరన ఛలో సినిమాలో నటించే అవకాశం అందుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు డెబ్యూ మూవీ కూడా సూపర్ హిట్ అవడంతో తెలుగులో వరుసగా నాని, నితిన్, శర్వానంద్, లాంటి యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ హీరోలతో నటించే అవకాశాలను అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

 rashmika mandanna Latest Red Dress Pic goes to viral

rashmika mandanna Latest Red Dress Pic goes to viral

ఇదే క్రమంలో అమ్మడి క్రేజ్ చూసి బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో గుడ్ బై, సిద్దార్థ్ మల్‌హోత్రాతో మిషన్ మజ్ఞు సినిమాలతో పాటు మరో సినిమాకి సైన్ చేసింది. కోలీవుడ్‌లో కూడా సుల్తాన్ సినిమాతో కార్తి సరసన నటించి తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజెస్ ఇస్తోంది.

Rashmika Mandanna : సైమా అవార్డ్ ఫంక్షన్‌లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కాగా రీసెంట్‌గా జరిగిన ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్ ఫంక్షన్‌లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీస్ కలిసి జరిపే ఈ సైమా వేడుకలకి నాలుగు సినిమా ఇండస్ట్రీస్‌కి సంబంధించిన సినీ తారలందరూ హాజరయ్యారు. ఇందులో రష్మిక ధరించిన రెడ్ కలర్ ట్రెండీ వేర్ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ రెడ్ డ్రెస్‌లో రష్మిక కాస్త ఘాటు అందాలను ఆరబోస్తూ కెమెరాలకి ఫోజులిచ్చింది. అసలే స్టార్ హీరోయిన్. తళ తళ మెరిసే డ్రెస్‌లో అందంగా కనిపిస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు. రష్మిక సైమా అవార్డ్ ఫంక్షన్ లో ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp