Rashmika Mandanna : రష్మికను చూసి సొల్లు కార్చడం కాదు.. ఆ అందాన్ని మెయిన్ టెన్ చేయడానికి ఎంత కష్టపడుతుందో చూడండి.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 25 January 2023, 8:40 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా అంటేనే ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. అంతేనా.. తెల్ల తోలు పిల్ల. తను తెల్లగా ఉండటం, ఫిట్ గా, సన్నగా ఉండటం వల్లనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది. దానితో పాటు తనకు మంచి అవకాశాలు వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయింది. తనను అందరూ నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

పుష్ప సినిమాలో తన రోల్ కు పడిపోని వాళ్లు లేరు. వయ్యారంగా నడుస్తూ తను ఎంతలా కుర్రాళ్లకు దడ పుట్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాతో తన రేంజే మారిపోయింది. ఇప్పుడు తనకు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలోనూ తన రోల్ చాలా ముఖ్యమైంది. తాజాగా రష్మిక మందన్నా.. జిమ్ లో కసరత్తులు చేసిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

Rashmika Mandanna latest workout video viral

Rashmika Mandanna latest workout video viral

Rashmika Mandanna : జిమ్ లో కసరత్తులు చేస్తున్న రష్మిక

ఎందుకంటే ఆ వీడియోలో తన ఎంత కష్టపడుతుందో చూస్తే అసలు రష్మిక అందాన్ని కాపాడుకోవడం కోసం, ఫిట్ నెస్ కోసం ఇన్ని కసరత్తులు చేస్తుందా అని ముక్కున వేలేసుకుంటారు. ఫుట్ బాల్ సైజ్ ఉన్న రెండు బాల్స్ మీద చేతులు, కాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ తను చేసిన కసరత్తు చూస్తే షాక్ అవ్వాల్సిందే. నెటిజన్లు అయితే వామ్మో నీ అందం వెనుక ఇంత కష్టం ఉందా తల్లి. నీకు దండం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి