Rashmika Mandanna : సినిమాలు వదిలేసి రష్మిక మందన్న న్యూస్ రిపోర్టర్‌గా మార‌బోతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : సినిమాలు వదిలేసి రష్మిక మందన్న న్యూస్ రిపోర్టర్‌గా మార‌బోతుందా?

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న రష్మిక మందన్న ఇక అక్క‌డ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టిస్తుంది. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా ఈ అమ్మ‌డు న‌టిస్తుంది. నేషనల్‌ క్రష్‌గా పాపులార్‌ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. అక్కడ ఆమెకి పాన్‌ ఇండియా ఆఫర్లు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 July 2022,7:00 pm

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న రష్మిక మందన్న ఇక అక్క‌డ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టిస్తుంది. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా ఈ అమ్మ‌డు న‌టిస్తుంది. నేషనల్‌ క్రష్‌గా పాపులార్‌ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. అక్కడ ఆమెకి పాన్‌ ఇండియా ఆఫర్లు వస్తుండటం విశేషం. `పుష్ప`తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ర‌ష్మిక గురించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అర్జున్ రెడ్డి సినిమాతో పాపులారిటీ అందుకున్న సందీప్ వంగ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా క్రేజీ పాత్ర‌తో అల‌రించ‌నుంద‌ట‌. ఆమె పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఒక న్యూస్ రిపోర్టర్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందని.. ఆ కనెక్షన్ కి ఆమె వృత్తికి కూడా లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక – రణబీర్ కపూర్ ల పై కీలక సీన్స్ ను కూడా షూట్ చేశారు. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది.

Rashmika Mandanna plays new reporter role

Rashmika Mandanna plays new reporter role

Rashmika Mandanna : డిఫ‌రెంట్ రోల్స్..

మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్‌’ సాగనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ‌రోవైపు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది రష్మిక. కేవలం అందాలకే పరిమితం కావడం లేదు. అద్భుతమైన నటనతోనూ మెప్పిస్తుంది. నిజానికి నటనతోనే పాపులర్‌ అయ్యింది. `ఛలో`, `గీతగోవిందం`లో ఆమె పాత్రలో అందుకు నిదర్శనం. ఆ తర్వాత మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లో మెరిసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది