Rashmika mandanna : రష్మిక మందన్న – పూజా హెగ్డే ఒకే సినిమాలో..?

Authored By vamana sai | The Telugu News | Published on: March 28, 2021, 9:30 pm

Rashmika mandanna : రష్మిక మందన్న – పూజా హెగ్డే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ముందున్నారు. ఇద్దరికీ సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు నార్త్ సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. పూజా హెగ్డే టాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీ, టీ – సిరీస్ బ్యానర్స్ పై భూషన్ కుమార్, కృషం రాజు సమర్పిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ ప్రశీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేసింది.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్న పూజా హెగ్డే రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక బాలీవుడ్ లో పూజా హెగ్డే సెటిలైనట్టే. ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ నటించబోతున్న 65వ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. మేకర్స్ ఈ విషయాన్ని రీసెంట్ గా కన్‌ఫర్మ్ చేశారు. కాగా రష్మిక మందన్న సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా 5 బాషల్లో రిలీజ్ కాబోతోంది.

rashmika mandanna pooja hegde in same movie

rashmika mandanna pooja hegde in same movie

Rashmika mandanna : విజయ్ 65 లో పూజా హెగ్డే, రష్మిక మందన్న..?

అంతేకాదు పూజా కంటే ఏం తక్కువ అన్నట్టుగా బాలీవుడ్ లో రష్మిక మందన్న కూడా రెండు సినిమాలు చేస్తోంది. సిద్దార్థ్ మల్‌హోత్ర కి జంటగా మిషన్ మజ్ఞు అన్న సినిమా అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఒక సినిమాలో ఆయన కూతురుగా ఒక సినిమా చేస్తోంది. అయితే పూజా హెగ్డే నటిస్తున్న కోలీవుడ్ సినిమాలో రష్మిక మందన్న కూడా మరొక హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. విజయ్ 65 లో పూజా హెగ్డే, రష్మిక మందన్న అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది త్వరలో క్లారిటీ రానుంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp