
#image_title
Bigg Boss Telugu 7 : రతిక రతిక రతిక.. వామ్మో ఈ అమ్మాయి మామూలు పిల్ల కాదు. డేర్ అండ్ డాషింగ్. హౌస్ మొత్తం ఒకవైపు.. తన ఇంకో వైపు అన్నట్టుగా చేస్తోంది. ప్రతి ఒక్కరిపై నేరుగానే మాటలు అంటోంది. ఏమాత్రం భయపడటం లేదు. మహాబలిలో టీమ్ లో తను టీమ్ మెంబర్. నిజానికి ఆ టీమ్ ఓడిపోయింది. అయితే.. మాయాస్త్ర టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మరో టాస్క్ ఇస్తాడు. రణధీర టీమ్ మెంబర్స్ దగ్గర మాయాస్త్రలోని 5 భాగాలు ఉంటాయి. అయితే.. రెండో పవరాస్త్ర కోసం ఈ టాస్క్ జరుగుతోంది. రెండో పవరాస్త్ర పొందిన ఒక వ్యక్తికి నాలుగు వారాల ఇమ్యూనిటీ లభిస్తుందని.. ఇప్పుడు ఆ రెండో పవరాస్త్ర సాధించే వాళ్లలో రణధీర టీమ్ వాళ్లే అర్హులు అని చెబుతాడు బిగ్ బాస్.
#image_title
అయితే.. రణధీర టీమ్ లో ఉన్నవాళ్లలో మాయాస్త్ర భాగాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్లే రెండో పవరాస్త్ర కోసం పోరాడుతారు అని చెబుతాడు బిగ్ బాస్. అయితే.. మహాబలి టీమ్ లో ఉన్నవాళ్లు ఒకరి దగ్గర ఉన్న మాయాస్త్ర భాగాన్ని తీసుకొని ఇంకొకరికి ఇవ్వాలి. అలా.. చివర్లో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ మాయాస్త్రాలు ఉంటే వాళ్లే రెండో పవరాస్త్ర కోసం పోటీ పడతారు అని చెబుతాడు. ఇదంతా పక్కన పెడితే ఎవరికి మాయాస్త్రాలు ఇవ్వాలి అనే దానిపై మహాబలి టీమ్ లో గొడవలు జరుగుతాయి. రతిక, దామిని మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. రతిక చివర్లో వెళ్లి ఇస్తానని మొండి పట్టు పట్టుకుంటుంది. ముందు శుభశ్రీ, ఆ తర్వాత ప్రశాంత్ వెళ్తారు. శుభశ్రీ.. శోభా నుంచి తీసుకొని ప్రిన్స్ కు ఇస్తుంది. ఆ తర్వాత రెండో సారి వెళ్లిన ప్రశాంత్.. అమర్ దీప్ నుంచి తీసుకొని శివాజీకి ఇస్తాడు. ఇక మూడో వ్యక్తిగా వెళ్లాలంటూ రతికకు టీమ్ మెంబర్స్ చెప్పినా కూడా రతిక వినదు. అస్సలు వెళ్లను అంటుంది. అది తన సీక్రెట్ టాస్క్ కావచ్చు కానీ.. తను మాత్రం చివర్లోనే వెళ్తా అని మొండి పట్టు పట్టుకుంటుంది.
మూడో ప్లేస్ లో రతికను వెళ్లాలని.. నాలుగు, ఐదో ప్లేసుల్లో తేజ, గౌతమ్ వెళ్తా అని చెబుతాడు. కానీ.. రతిక అస్సలు వినదు. అస్సలు పోనంటే పోను.. చివర్లోనే వెళ్తా అంటుంది. ఇక ఈమెతో గొడవ ఎందుకు అని మూడో ప్లేస్ లో వెళ్తుంది. ప్రియాంక నుంచి తీసుకొని షకీలాకు ఇచ్చేస్తుంది దామిని. ఆ తర్వాత నాలుగు, ఐదో ప్లేస్ గురించి గొడవ జరుగుతుంది. అయినా కూడా వెళ్లను అంటుంది. రతిక, తేజ, గౌతమ్ ఈ ముగ్గురు ఎవరు కూడా నాలుగో ప్లేస్ లో వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో టైమ్ అయిపోతుంది. దీంతో బిగ్ బాస్ మహాబలి టీమ్ ను పక్కకు తప్పించే ఆ నిర్ణయం రణధీర టీమ్ తీసుకోవాలని చెబుతాడు. అంతకుముందే నాకు ఈ టీమ్ లో ఉండాలని లేదు. మీరంతా బఫూన్స్, చెండాలం. అసలు వీళ్లంతా బఫూన్స్ అంటూ రతిక రెచ్చిపోతుంది. ఇక.. బిగ్ బాస్ కూడా చివరకు టైమ్ వేస్ట్ కాకుండా రణధీర టీమ్ నే డిసైడ్ చేసుకోవాలని చెప్పడంతో అమర్ దీప్, శోభాశెట్టికి కోపం వస్తుంది. ఎందుకంటే.. వాళ్లు పవరాస్త్ర పోటీ నుంచి తప్పుకోవడంతో అమర్ దీప్ ఏడ్చేస్తాడు. రతిక మీద అరిచేస్తాడు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.