Ravi Teja dialogues creates nuisance in tollywood
Ravi Teja : మాస్ మహారాజా రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక రవితేజ లేటెస్ట్ సినిమా ‘ ధమాకా ‘ టీజర్ కూడా విడుదల అయింది. ఇక ఈ ట్రైలర్ కి పవర్ ఫుల్ మాస్ సినిమా అని టాక్ వచ్చేసింది. రవితేజ ఎనర్జీ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీతో డాన్స్, డైలాగ్స్ తో కుమ్మేసాడు. ఇక హీరోయిన్గా శ్రీ లీల తన అందం, తన మాటలు, ఎక్స్ప్రెషన్స్, రవితేజ డ్యూయల్ రోల్ చేయడం డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించడం ఈ సినిమా టీజర్ పై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ ధమాకా సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. నిజంగా ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా చూసినంతగా అనిపించింది. రవితేజకు చాలా రోజుల తర్వాత హిట్ రాబోతుందని ఈ టీజర్ చూశాక ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. అయితే ఈ ట్రైలర్ లో ఓ డైలాగ్ మాత్రం కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీంతోపాటు స్టార్ హీరోస్ తారక్, బన్నీ, చరణ్ ఫాన్స్ రవితేజ కావాలనే ఆ డైలాగుతో తమ హీరోలను టార్గెట్ చేసాడంటూ ఫైర్ అవుతున్నారు. ‘ నేను వెనుకున్న వాళ్ళని చూసి ముందుకొచ్చినోడిని కాదురోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ‘
Ravi Teja dialogues creates nuisance in tollywood
అన్న డైలాగ్ రవితేజ సినిమాలో చెబుతాడు. అంటే తెలుగు పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ కావాలనే ఈడైలాగ్ చెప్పాడన్న కాంట్రవర్సీని ఇప్పుడు ఆ ముగ్గురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. రవితేజకు ఆరు ఏడు సినిమాలు చేస్తే కానీ ఒక్క హిట్ రావడం లేదు. ఈ ఏడాది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటిది ఆయనకి ఇంత ఓవర్ అవసరమా అని ముగ్గురు హీరోలు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
Racha Ravi : 2013లో ప్రారంభమైన జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…
Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…
Naga Panchami : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా…
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
This website uses cookies.