Ravi Teja : రవితేజ పేరు చెప్తే కోపంతో రగిలిపోతోన్న జూనియర్ ఎన్‌టి‌ఆర్, అల్లూ అర్జున్ ఫ్యాన్స్…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 December 2022, 7:30 pm

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక రవితేజ లేటెస్ట్ సినిమా ‘ ధమాకా ‘ టీజర్ కూడా విడుదల అయింది. ఇక ఈ ట్రైలర్ కి పవర్ ఫుల్ మాస్ సినిమా అని టాక్ వచ్చేసింది. రవితేజ ఎనర్జీ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీతో డాన్స్, డైలాగ్స్ తో కుమ్మేసాడు. ఇక హీరోయిన్గా శ్రీ లీల తన అందం, తన మాటలు, ఎక్స్ప్రెషన్స్, రవితేజ డ్యూయల్ రోల్ చేయడం డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించడం ఈ సినిమా టీజర్ పై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ ధమాకా సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. నిజంగా ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా చూసినంతగా అనిపించింది. రవితేజకు చాలా రోజుల తర్వాత హిట్ రాబోతుందని ఈ టీజర్ చూశాక ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. అయితే ఈ ట్రైలర్ లో ఓ డైలాగ్ మాత్రం కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీంతోపాటు స్టార్ హీరోస్ తారక్, బన్నీ, చరణ్ ఫాన్స్ రవితేజ కావాలనే ఆ డైలాగుతో తమ హీరోలను టార్గెట్ చేసాడంటూ ఫైర్ అవుతున్నారు. ‘ నేను వెనుకున్న వాళ్ళని చూసి ముందుకొచ్చినోడిని కాదురోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ‘

Ravi Teja dialogues creates nuisance in tollywood

Ravi Teja dialogues creates nuisance in tollywood

అన్న డైలాగ్ రవితేజ సినిమాలో చెబుతాడు. అంటే తెలుగు పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోల‌ను టార్గెట్ చేస్తూ కావాల‌నే ఈడైలాగ్ చెప్పాడ‌న్న కాంట్ర‌వ‌ర్సీని ఇప్పుడు ఆ ముగ్గురు హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో రచ్చ చేశారు. రవితేజకు ఆరు ఏడు సినిమాలు చేస్తే కానీ ఒక్క హిట్ రావడం లేదు. ఈ ఏడాది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటిది ఆయనకి ఇంత ఓవర్ అవసరమా అని ముగ్గురు హీరోలు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp