
Ravi Teja Eagle Movie : ఈగల్ టికెట్లపై మూవీ టీం అదిరిపోయే ఆఫర్...అతి తక్కువ ధరకే మూవీ టికెట్స్..!
Ravi Teja Eagle Movie : మాస్ మహారాజా కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తాజాగా రూపొందించిన చిత్రం ఈగల్. అయితే ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుని ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టికెట్ల ధరలపై చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అయితే కొత్త సినిమాలు వచ్చినప్పుడు పెద్ద హీరోల సినిమాలో అయితే టికెట్లు ధరలు పెంచి మరి ప్రదర్శిస్తారు. అయితే ఈ సినిమా కి మాత్రం భిన్నంగా సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను తగ్గించింది మూవీ టీం.ఇక ఈ మూవీ టికెట్ ధరల వివరాల్లోకి వెళితే తెలంగాణలోని మల్టీప్లెక్స్ లో 200, సింగల్ స్క్రీన్ థియేటర్లో 150 కే మూవీ టికెట్లు ధరలను నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే సాధారణంగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 295 గా నిర్మించే అవకాశం ఉంది. కానీ ఈగల్ మూవీ టీం మాత్రం సినిమాను వీలైనంత మందికి చేరవేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో టికెట్ ధర 200 గా చూపిస్తుంది. అయితే ఫిబ్రవరి , మార్చి లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి చాలామంది మూవీలకి దూరంగా ఉంటారు. అయినప్పటికీ కథ పై ఉన్న నమ్మకంతో చిత్రబంధం ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా కి సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. హీరో రవితేజ తో పాటు సినీ బృందం కూడా కలిసి ఈ సినిమాను చూసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ చూసిన అనంతరం కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ పై రవితేజ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్క్రీనింగ్ ముగిసిన అనంతరం దర్శకుడు కూడా చిత్ర నిర్మాతకు శుభాకాంక్షలుు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ , హీరోయిన్లుగా నటిస్తుండగా నవదీప్ అవసరాల శ్రీనివాస్ అజయ్ ఘోష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
తాజాగా నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాఖకు చెందిన కిషోర్ అనే యువకుడు రవితేజ లైఫ్ జర్నీని ర్యాప్ సాంగ్ రూపంలో పాడుతూ అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ పాట ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక ఆ పాటకు రవితేజ సినిమాలోని కొన్ని సీన్స్ ను జోడించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఆ వీడియోను ఈగల్ సినిమాను నిర్మించిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేస్తూ చాలా బాగుంది అని ట్విట్ చేసింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.