Ravi teja : రవితేజ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. ప్లాన్ అదిరిపోయింది ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ravi teja : రవితేజ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. ప్లాన్ అదిరిపోయింది ..?

Ravi teja : మాస్ మసాలా హీరోగా టాలీవుడ్ లో రవితేజ కు ఉన్న క్రేజే వేరు . ఆయన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేసే పద్దతే విభిన్నం . ఎలాంటి పాత్ర లో అయినా పరకాయ ప్రవేశం చేసి నవరసాలు పండించగల సత్తా రవితేజకు ఉంది. అందుకే ప్రేక్షకులు ఆయన యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు . ఇక లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటంటే రవితేజ కూతురు కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు […]

 Authored By govind | The Telugu News | Updated on :28 January 2021,9:44 am

Ravi teja : మాస్ మసాలా హీరోగా టాలీవుడ్ లో రవితేజ కు ఉన్న క్రేజే వేరు . ఆయన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేసే పద్దతే విభిన్నం . ఎలాంటి పాత్ర లో అయినా పరకాయ ప్రవేశం చేసి నవరసాలు పండించగల సత్తా రవితేజకు ఉంది. అందుకే ప్రేక్షకులు ఆయన యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు . ఇక లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటంటే రవితేజ కూతురు కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోందట. అవునా అని అవాక్కు అవకండి రవి తేజ రియల్ కూతురు కాదు రీల్ కూతురు . ఆమె ఎవరని ఆలోచనలో పడకండి. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన విక్రమార్కుడు చిత్రం లో తల్లి లేని అమాయకపు చిన్నారిగా అందరిని ఆకట్టుకున్ననేహా తోట ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని రీతిగా తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

 

నిండా 5 ఏళ్ళు కూడా నిండని వయసులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్షా సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమా ల తర్వాత నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి కానీ నేహా పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. స్టడీ పైన దృష్టిపెట్టింది . ఆలా సినిమాలకు దూరం అయ్యింది. చాల గ్యాప్ తర్వాత నేహా తన టీనేజ్ పిక్స్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా నేహా అందం అదుర్స్ అంటూ కితాబు ఇస్తున్నారు.

Ravi teja : రవితేజ కూతురు స్టార్ హీరోయిన్ గా సక్సస్ అవుతుందా ..?

ప్రెజంట్ నేహా ఫ్లోరిడాలో బిజినెస్ మానేజ్మెంట్ లో ఎంబీఏ చేస్తోందట. యాక్టింగ్ అంటే తనకు చాల ఇష్టమని చెప్పుకొస్తున్న ఈ క్యూటీ ఎంబీఏ పూర్తి అయ్యాక మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పుకొస్తోంది. ఏది ఏమైనా మూడేళ్ళ వయసులో చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే తానేంటో ప్రూవ్ చేసుకుంది ఈ చిన్నది . మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై సందడి చేయాలనీ మనమూ ఆశిద్దాం .

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది