
Reason Behind the dispute between Prabhas and Allu Arjun Fans
Prabhas – Allu Arjun : స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫైటింగ్ ఈ నాటిది కాదు. కొన్నేళ్ల నుండి హీరోల అభిమానులు ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. చిన్న చిన్న కారణాలకు దాడులు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఒకే భాషకి చెందిన హీరోల అభిమానులతోనే కాదు ఇతర భాషలకు చెందిన హీరోల అభిమానులతో కూడా ఫైటింగ్ నడుస్తుంది. తాజాగా అల్లు అర్జున్, ప్రభాస్ మధ్య ఆసక్తికర ఫైటింగ్ నడుస్తుండగా, ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వైరంకి ప్రధాన కారణమేంటన్నది వీడియో చూస్తే తెలుస్తుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారడమే కాక దేశ వ్యాప్తంగా ఆదరణ పొందాడు. అంతకుముందు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే క్రేజ్ ఉన్న హీరోగా తెలిసిన బన్నీ, పుష్ప సినిమాతో యావత్ ప్రపంచానికి తన సత్తా చాటాడు. కేవలం రీజినల్ మూవీగా మాత్రమే రిలీజ్ అయిన పుష్ప ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజం, ఆయన యాక్టింగ్, డ్యాన్స్ స్టెప్పులకు యావత్ ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
Reason Behind the dispute between Prabhas and Allu Arjun Fans
ఈ నేపథ్యంలోనే ప్రముఖ మ్యాగెజిన్ ఇండియా టుడే కవర్ పేజీపై సౌత్ స్వాగ్ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోను ప్రింట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ కావడమే కాకుండా ఆయనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్‌తో వార్ డిక్లేర్ చేశారు. తమ హీరో 2017లోనే ఇండియా టుడే కవర్ పేజీపై కనిపించాడని, అప్పుడే దక్షిణాది సినిమా గురించి యావత్ దేశం చర్చించుకునేలా చేశాడని వారు కామెంట్స్ చేస్తున్నారు.
దీనికి కౌంటర్‌గా బన్నీ ఫ్యాన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అప్పుడు బాహుబలి సినిమా గురించే ప్రభాస్ ఫోటో వేశారని, కానీ తమ హీరో ఫోటోను ఆయన తన స్టైల్‌ను యావత్ ప్రపంచానికి రుచిచూపించడంతో ఇప్పుడు అది ట్రెండ్‌గా మారడంతో ఆయనకు ఇండియా టుడే ఈ విధంగా సత్కారం చేసిందంటూ బన్నీ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇండియా టుడే కవర్ పేజీపై బన్నీ స్టైలిష్ ఫోటో కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఛానల్స్‌లోనూ ఈ ఫ్యాన్ వార్ గురించి చర్చ సాగుతుండటం గమనార్హం.
Reason Behind the dispute between Prabhas and Allu Arjun Fans
ఏదేమైనా ఒక్క పాన్ ఇండియా సినిమా రిలీజ్ లేకుండా అల్లు అర్జున్ తన క్రేజ్, స్టైల్ కారణంగా ఇండియా టుడే కవర్ పేజీపై తన స్వాగ్‌ను చూపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఓఆర్ మ్యాక్స్ మీడియా వారి విశ్లేషణ ప్రకారం..బన్నీ కంటే ప్రభాస్ కే జనాదరణ ఎక్కువ ఉంది. ఓఆర్ మ్యాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ కేటగిరిలో ఫస్ట్ పొజిషన్ ప్రభాస్ ను వరించింది. రెండో స్థానం లో తారక్, మూడో స్థానంలో అల్లు అర్జున్ , నాలుగో స్థానంలో మహేశ్ బాబు, ఐదో స్థానంలో రామ్ చరణ్, ఆరో స్థానంలో పవన్ కల్యాన్, ఏడో స్థానంలో నాని, ఎనిమిదో స్థానంలో చిరంజీవి, తొమ్మిదో స్థానంలో విజయ్ దేవరకొండ, పదో స్థానంలో రవితేజ ఉన్నారు.
ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’లపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలలో ఏదైన పెద్ద హిట్ పడిందంటే ప్రభాస్‌ని అందుకోవడం ఎవరి తరం కాదు. ఇక బన్నీ పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.